ENGLISH

గ్లామ్‌షాట్‌: రకుల్‌ అదిరెను సొగసుల్‌

16 September 2017-15:23 PM

క్యూట్‌గా కవ్విస్తూనే, స్వీట్‌ స్మైల్‌తో ఎట్రాక్ట్‌ చేస్తుంది ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. గ్లామర్‌ విషయంలో అమ్మడికి హద్దుల్లేవు. కానీ మంచి టేస్ట్‌ అయితే ఉంది. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినఫ్పుడు ఫ్యాషన్‌లోని ఆమెకున్న టేస్ట్‌ బయట పడుతూ ఉంటుంది. తాజాగా 'స్పైడర్‌' సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో రకుల్‌ ఇలా లైట్‌ గ్రీన్‌ కాస్టూమ్‌లో తళుక్కుమంది. లేలేత సీతాకోక చిలుకలా మెరిసిపోయింది. ట్రెడిషనల్‌గా కనిపిస్తున్నట్లే మోడ్రన్‌ టచ్‌ ఇచ్చినట్లున్న రకుల్‌ అందానికి అభిమానులు ముగ్థులయిపోయారు. కెమెరా దృష్టిని తన వైపు నుండి తిప్పుకోనీయకుండా చేసింది ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్‌తో. 'స్పైడర్‌'లో సూపర్‌ స్టార్‌ మహేష్‌ అందానికి సరిజోడిగా రకుల్‌ అందం భలే కుదిరిందిలే. త్వరలోనే ఈ సినిమాతో అందాల రకుల్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: తేజ డైరెక్షన్‌లో బాలయ్య పొలిటికల్‌ మూవీ?