సామాన్యుడి దగ్గరనుంచి సెలబ్రిటీ వరకూ అందరికీ కార్లు, బైక్స్ అంటే మక్కువ. వీటిని కలక్ట్ చేసి దాచుకుంటే ఆ కిక్కే వేరు. కానీ అందరికీ ఇది సాధ్యం కావాలి కదా. సెలబ్రిటీస్ నచ్చిన కార్లు, బైక్స్ కొనటం పరిపాటే, మన సెలబ్రిటీలలో చాలా మందికి కార్లు, బైక్స్ కలక్ట్ చేసే అలవాటు ఉంది. ముఖ్యంగా క్రికెటర్ ధోనీ ఈ వరసలో ముందుంటాడు. ధోనీ బైక్స్, కార్ల కలక్షన్ కి ఏకంగా గ్యారేజ్ ఉండటం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేని కలక్షన్ కూడా ధోనీ దగ్గర ఉంది. తాజాగా ఈ లిస్ట్ లో పాన్ ఇండియా హీరో దుల్కర్ సల్మాన్ కూడా చోటు దక్కించుకున్నారు.
లక్కీ భాస్కర్ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా దుల్కర్ ఆహాలో బాలయ్య అన్స్టాపబుల్ షో కి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దుల్కర్ అనేక విషయాలు షేర్ చేసుకున్నాడు. ఇప్పటివరకు ఎప్పుడూ ఎవరికీ తెలియని విషయాలు ఈ షో లో రివీల్ చేసారు. దుల్కర్ లవ్ స్టోరీ, పెళ్లి వీటితో పాటు తనకున్న కార్ల పిచ్చి కూడా బయట పడింది. దుల్కర్ కి కార్లంటే చాలా పిచ్చి అంట. నచ్చిన ప్రతి కారు కొనేస్తాడట. లక్కీ భాస్కర్ మూవీలో తాను వాడిన 'నిస్సాన్ పాట్రోల్' జీప్ మోడల్ కార్ కూడా తనదే అని, కొన్ని రిపైర్స్, చిన్న చిన్న మార్పులు చేసి అది సినిమాలో యూజ్ చేసినట్లు తెలిపాడు దుల్కర్.
టోటల్ గా తన దగ్గర 70 కార్లు ఉన్నాయని తెలిసింది. దుల్కర్ భార్య సోఫియాకి భయపడి కొన్ని కార్లు హైద్రాబాద్ లో ఫ్రెండ్స్ ఇళ్లల్లో పెట్టాడట. ఈ విషయాన్ని లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి బాలయ్యకి చెప్పాడు. భార్య తిడుతుందని దాచిన కార్ల విషయం ఇలా పబ్లిక్ గా రివీల్ చేసాడు వెంకీ అట్లూరి. ఇది విన్న నెటిజన్స్ దుల్కర్ దగ్గర 70 కార్లు ఉన్నాయా ? అని ఆశ్చర్య పోతున్నారు. అంత ప్లేస్ ఎక్కడ ఉంది. ఏయే కార్లున్నాయి, వాటిని ఒక్క సారి షో చేస్తే బాగుణ్ణు అని ఆశపడుతున్నారు.