`రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో, శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాతలు దిల్ రాజు,శిరీష్ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం `డి.జె..దువ్వాడ జగన్నాథమ్`.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందిన 25వ సినిమా ఇది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 23న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నారు. యు.ఎస్‌లో సినిమాను 300 లొకేషన్స్ లో విడుదల చేస్తుండటం విశేషం.
ప్రెస్ రిలీజ్
ALSO READ: లాస్య నటించిన రాజా మీరు కేక మూవీ రివ్యూ & రేటింగ్స్