రవి దుర్గా ప్రసాద్ దర్శకత్వంలో ఓ సినిమా తెరక్కెబోతోంది. 'బిల్లా' ఫేం మెహర్ రమేష్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు రవి దుర్గా ప్రసాద్. అంతే కాదు, ప్రభుదేవా, రాహుల్ బోస్ వంటి సినీ ప్రముఖుల వద్దా శిష్యరికం చేశాడట. ఇదొక ఫిమేల్ సెంట్రిక్ మూవీ అని తెలియవస్తోంది. ఎంఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్, కవిత కంబైన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తాయి. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతోందట. ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనుకుంటున్నారా? నిహారిక. మెగా హీరోయిన్‌గా నిహారిక 'ఒక మనసు' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా నిహారికకు ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. తొలి సినిమా విజయవంతం కాకపోవడంతో నిహారిక కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ వస్తోంది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న తపనతో ఉంది నీహారిక. తొలి సినిమా 'ఒక మనసు'తో నటన పరంగా నిహారిక మంచి మార్కులే వేయించుకున్నా కానీ, కాన్సెప్ట్ పరంగా ఆ సినిమా నిహారికకు సెట్ కాలేదనీ అప్పట్లో టాక్ వినిపించింది. అందుకే ఈ సారి ట్రాక్ మార్చి నిహారిక ఎంటర్‌టైన్ మూవీతో మన ముందుకు వస్తోంది. ఈ సారి మెగా ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్ చేయనంటోంది ఈ ముద్దుగుమ్మ. అలాగే ఇకపై వరుసగా సినిమాలు చేస్తానని కూడా ఫ్యాన్స్‌కి సంకేతాల్సిఓ్తంది. ప్రస్తుతం తమిళంలో కూడా ఓ సినిమా చేస్తోంది ఈ మెగా డాటర్.
ALSO READ: బోయపాటీ ఈ టైటిల్ ఏంటీ!