ENGLISH

కొడుతున్నాం, కొట్టేస్తున్నాం: బన్నీ కాన్ఫిడెన్స్‌

12 June 2017-11:28 AM

'డీజె - దువ్వాడ జగన్నాధమ్‌' సినిమా కొత్త ట్రైలర్‌ వచ్చింది. మొదటి ట్రైలర్‌కే విపరీతమైన స్పందన వచ్చింది. రెండో ట్రైలర్‌ ఇంకా వేగంగా దూసుకుపోతోంది. యూ ట్యూబ్‌లో సంచలనాలకు కేంద్ర బిందువవుతోంది. యూ ట్యూబ్‌ సంచలనాలకు ఎప్పుడూ ముందుంటాడు అల్లు అర్జున్‌ తన సినిమాలతో. జూన్‌ 23న 'డీజె' సినిమా విడుదలవుతోంది. తాజాగా వచ్చిన ట్రైలర్‌ చివర్లో 'కొడుతున్నాం, కొట్టేస్తున్నాం' అని బన్నీ చెప్పే డైలాగ్‌ సినిమా 'హిట్‌' అవబోతోందనడానికి సంకేతంగా అనిపిస్తోంది.

చిత్ర యూనిట్‌ అంతా ఈ సినిమా విజయంపై చాలా నమ్మకంగా ఉన్నారు. కాంబినేషన్‌ అలాంటిది మరి. దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో రూపొదుతోన్న చిత్రమిది. ఎనర్జిటిక్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. రాకింగ్‌ దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌లో పాటలు ఇప్పటికే ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటున్నాయి. ఇక అల్లు అర్జున్‌ యాక్టింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. హీరోయిన్‌ పూజా హెగ్దే తొలి ట్రైలర్‌ నుంచే అంచనాలు పెంచేస్తోంది. 'అస్మైక యాగ..' రొమాంటిక్‌ సాంగ్‌తో అమ్మడు అంచనాల్ని మరింత రెట్టింపు చేసింది. ఎటు చూసినా అన్నీ ప్లస్‌ పాయింట్సే కనిపిస్తున్నాయి ఈ సినిమా సక్సెస్‌ అవడానికి. మొదటి ట్రైలర్‌లో జూన్‌ 23న లుద్దాం.. అని చెప్పాడు. రెండో ట్రైలర్‌లో హిట్‌పై అభిమానులకు భరోసా ఇచ్చాడ బన్నీ. ఇవన్నీ చూస్తుంటే ఇక ఫ్యాన్స్‌ ఫిక్సయిపోవాల్సిందే. బన్నీ మళ్లీ హిట్‌ కొట్టేయడానికే వస్తున్నాడని! 

ALSO READ: సినారే అస్తమయం