ENGLISH

ప్రాణాలతో బయట పడ్డ ఇమ్రాన్ హష్మీ

09 October 2024-16:05 PM

బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ ఈ మధ్య తెలుగు హీరోలకోసం విలన్ గా మారారు. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి తెలుగు సినిమాల్లో విలన్ అవతారం ఎత్తాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్  హీరోగా తెరకెక్కుతున్న 'OG'లో విలన్ గా నటిస్తున్నాడు. నెక్స్ట్ అడవి శేషు హీరోగా నటిస్తున్న గూడాచారికి సీక్వెల్ గా వస్తున్న గూడాచారి 2 లో కూడా విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా యాక్షన్ సీన్స్ లో ఇమ్రాన్ హష్మీ ప్రమాదానికి గురయ్యారు. తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. 


'గూఢాచారి 2' కి యాక్షన్ సీన్స్ ని ఇమ్రాన్ హష్మీ డిజైన్ చేసినట్లు టాక్. హీరో అడవి శేష్ తో పాటు దర్శకుడ వినయ్ కూడా ఇమ్రాన్ ని ప్రోత్సహించినట్లు తెలుస్తోంది.  ఇమ్రాన్  డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లోనే ఈ ప్రమాదం జరిగింది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. ఐరన్ రూఫ్ మీద నుంచి ఇమ్రాన్ జంప్ చేస్తుండగా ఓ ఇనుప ముక్క మెడకు తగిలినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇమ్రాన్ మెడకు తీవ్ర గాయం అయ్యింది.  మూవీ యూనిట్ వెంటనే రెస్పాండ్ అయ్యి ఇమ్రాన్ ని హాస్పిటల్ లో జాయిన్ చేసారు.  డాక్టర్స్ నెక్ కి ట్రీట్ మెంట్ చేసి, కోలుకున్నాక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రమాదకర స్థాయిలో గాయం కాలేదని, ఏం పర్వాలేదని డాక్టర్స్ పేర్కొన్నారు.