ENGLISH

పుష్ప 2 రిలీజ్ డేట్ మార్పుతో ఫాన్స్ లో ఉత్సాహం

09 October 2024-16:08 PM

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2'  ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్, బన్నీ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ వన్ బన్నీ కి మంచి పేరు తెచ్చి పెట్టి, పాన్ ఇండియా హీరోని చేసింది. టాలీవుడ్ హీరోలకి అందని ద్రాక్షగా ఉన్న నేషనల్ అవార్డుని బన్నీకి తెచ్చి పెట్టింది. దీనితో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్పలో బన్నీ నట విశ్వరూపం చూసిన ఫాన్స్ సెకండ్ పార్ట్ కోసం ఈగర్లీ వెయిటింగ్. ఈ మూవీ ఆగస్టు 15 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేసి, తరవాత పోస్టు ఫోన్ చేశారు. డిసెంబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటివరకు అనుకున్నారు. 


కానీ మళ్ళీ ఇంకో సారి పుష్ప 2 వాయిదా పడింది. కాకపోతే ఈ వాయిదా ఫాన్స్ కి ఉత్సహాన్ని ఇచ్చింది. అదేంటి సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ అయితే ఆనందం దేనికి అనుకుంటున్నారా? పుష్ప 2 అనుకున్న దానికంటే ముందే సందడి చేయనుంది. డిసెంబరు 6న రావాల్సిన పుష్ప 2 ఒక్క రోజే ముందే  డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో రిలీజ్ అవుతోందని టాక్. సొషల్ మీడియాలో ప్రస్తుతం ఈ న్యూస్ హల్చల్ చేస్తోంది. పుష్ప 2 ప్రీపోన్ అయ్యిందో లేదో అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.  


ప్రస్తుతం పుష్ప 2 కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు , ఐటెం సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది అని,   అక్టోబర్ చివరికి షూటింగ్‌ షెడ్యూల్ పూర్తి కావస్తున్నట్లు, మైత్రి మూవీ మేకర్స్ కి సంబంధించిన మేనేజర్‌ స్పష్టం చేశారు. నవంబర్‌ నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ని స్టార్ట్ చేస్తారని సమాచారం.  నవంబరులోనే ప్రమోషన్స్ నిర్వహించేలా సుక్కు, బన్నీ ప్లాన్ చేస్తున్నారట.