ENGLISH

Ram Charan: చ‌రణ్ ఇంటికి క్రికెట‌ర్లు.. నిజ‌మేనా?

28 September 2022-13:00 PM

ఇటీవ‌ల ఉప్ప‌ల్ స్టేడియంలో ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్ జ‌రిగింది. ఆ మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజ‌యం సాధించి సిరీస్‌ని కైవ‌సం చేసుకొంది. అదే రోజు రాత్రి.. ఇండియ‌న్ క్రికెట‌ర్ల‌కు రామ్ చ‌ర‌ణ్ ఆధిత్యం ఇచ్చార‌ని, క్రికెటర్లుచ‌ర‌ణ్ ఇంటికి వెళ్లి, డిన్న‌ర్ చేశార‌ని వార్త‌లొచ్చాయి.

 

అయితే... వీటికి సంబంధించి ఒక్క ఫొటో కూడా బ‌య‌ట‌కు రాలేదు. అవి చ‌ర‌ణ్ మెల్ల‌గా వ‌దులుతాడ‌ని అనుకొన్నారు. అయితే నిజం ఏమిటంటే... చ‌ర‌ణ్ ఇంటికి మ‌న క్రికెటర్లు ఎవ‌రూ వెళ్ల‌లేద‌ట‌. మ‌రి ఈ న్యూస్ ఎవ‌రు సృష్టించారో, ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చిందో.. అర్థం కావ‌డం లేదు. గ‌తంలో స‌చిన్ టెండూల్క‌ర్ ఓ సారి చిరంజీవి ఇంటికి వెళ్లిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. చిరు, ప‌వ‌న్‌, చ‌ర‌ణ్‌... వీళ్లంతా సచిన్‌తో ఫొటోలు కూడా తీసుకొన్నారు. ఆ ఫొటోలు బాగా వైర‌ల్ అయ్యాయి. చ‌ర‌ణ్ ఇంటికి టీమ్ ఇండియా క్రికెట‌ర్లు వ‌చ్చుంటే ఈ పాటికి ఆ ఫొటోలెప్పుడో బ‌య‌ట‌కు వ‌చ్చేవి. కానీ రాలేదు. అంటే... ఈ న్యూస్ కేవ‌లం పుకారే అన్న‌మాట‌.

ALSO READ: మహేశ్‌బాబుకు మాతృవియోగం