ENGLISH

Hrithik Roshan: హృతిక్ రోష‌న్ తో గీతా ఆర్ట్స్ సినిమా

28 September 2022-15:00 PM

టాలీవుడ్ సంస్థ‌లు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల‌పై దృష్టి పెట్టాయి. బాలీవుడ్ హీరోల‌తో సినిమాలు చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ దిశ‌గా గీతా ఆర్ట్స్ ఎప్పుడో ముంద‌డుగు వేసింది. అమీర్ ఖాన్ తో గ‌జిని సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసి సూప‌ర్ హిట్టు కొట్టింది. ఇప్పుడు మ‌రోసారి అదే ప్ర‌య‌త్నం చేస్తోంది. హృతిక్ రోష‌న్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తోంది గీతా ఆర్ట్స్‌. దీనికి చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ఉంది.

 

ఇటీవ‌ల కార్తికేయ 2తో సూప‌ర్ హిట్టు సాధించాడు చందూ. త‌న త‌దుప‌రి సినిమా గీతా ఆర్ట్స్‌లోనే. ఇప్ప‌టికే ఓ క‌థ సిద్ధం చేశాడు చందూ మొండేటి. దాన్ని పాన్ ఇండియా స్థాయిలో తీయాల‌ని గీతా ఆర్ట్స్ భావిస్తోంది. ఇప్ప‌టికే ఒక‌రిద్ద‌రు బాలీవుడ్ హీరోల‌తో చ‌ర్చ‌లు మొద‌లెట్టిన‌ట్టు తెలుస్తోంది. అందులో హృతిక్ రోష‌న్ ఒక‌డు. అన్నీ కుదిరితే చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో హృతిక్ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా ఉండొచ్చు. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్టు పైప్ లైన్‌లో ఉంది. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డ‌వుతాయి.

ALSO READ: 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' తో పోలికెందుకు?