ENGLISH

బికినీలో కన్పిస్తే తప్పేంటి?

08 June 2017-12:52 PM

బాలీవుడ్‌ నటి, 'దంగల్‌'తో పాపులర్‌ అయిన ఫాతిమా సనా షేక్‌ ఇంకోసారి వివాదాల్లోకి ఎక్కడం చర్చనీయాంశంగా మారింది. ఇంకే నటికీ లేని విమర్శలు ఫాతిమా మీదనే వస్తుండడం ఆశ్చర్యకరం. సినీ రంగంలో గ్లామర్‌ తప్పనిసరి. బాలీవుడ్‌లో అయితే బహుశా బికినీ వేయని బ్యూటీ దొరకడం కష్టమే కావొచ్చు. బికినీలో అంద చందాలు ప్రదర్శించడం చాలా సాధారణం బాలీవుడ్‌లో. ఫాతిమా కూడా అలాగే బికినీలో పొటోలకు పోజులిచ్చింది. అయితే ఫాతిమా బికినీలో కనిపించడాన్ని కొందరు మత ఛాందసవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెపై ఫత్వా జారీ చేయాలంటూ సోషల్‌ మీడియాలో డిమాండ్‌ చేస్తుండడం సంచలనంగా మారింది. పవిత్ర రమదాన్‌ మాసంలో ముస్లిం మత విశ్వాసాల్ని దెబ్బతీయడమేంటని ఆమెను ప్రశ్నిస్తున్నారు కొందరు. అయితే గ్లామరస్‌ రంగంలో ఉన్న తాను ఏం చేయాలో తనకు తెలుసని మత విశ్వాసాలకీ సినీ రంగానికీ లింక్‌ పెట్టడం సబబు కాదని ఫాతిమా చెబుతోంది. ఫాతిమా సనా షేక్‌ ప్రస్తుతం 'థోగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌' అనే సినిమాలో నటిస్తోంది. విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అమీర్‌ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఏదేమైనా బికినీ ధరించిందన్న కారణంగా వివాదాల్లోకి లాగడం సబబు కాదు. పలువురు బాలీవుడ్‌ సినీ ప్రముఖులు ఫాతిమాకి అండగా నిలుస్తున్నారు ఈ వివాదంలో.

ALSO READ: మరికొన్ని ఫాతిమా ఫొటోస్ కోసం క్లిక్ చేయండి