ENGLISH

కూతురి ప్రమోషన్‌లో 'మామ్‌'

08 June 2017-12:47 PM

కుమార్తె గురించి ప్రశ్నిస్తే చాలు శ్రీదేవి విసుక్కుంటోంది. కానీ తన కొత్త సినిమా 'మామ్‌' ప్రమోషన్‌ కోసం కూతుళ్ళను వెంటేసుకు వెళుతోంది. మీడియాకి శ్రీదేవి తీరు అస్సలేమాత్రం అర్థం కావడంలేదు. శ్రీదేవి ఎందుకు ఇలా చేస్తోంది? కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసిన శ్రీదేవి, మీడియా ఫ్రెండ్లీగా అప్పుడూ ఇప్పుడూ వ్యవహరిస్తోన్న మాట వాస్తవం. అయితే ఇప్పుడెందుకో శ్రీదేవి మీడియాని కన్‌ఫ్యూజ్‌ చేసేస్తోంది. శ్రీదేవి కుమార్తె జాన్వీ త్వరలో తెరంగేట్రం చేయబోతోంది. ఇందుకోసమే ఆమె జిమ్‌ల వెంట పరుగులు తీస్తోంది కూడా. మీడియాని ఫేస్‌ చేసే క్రమంలో జాన్వీ తన కెరీర్‌ గురించి ఏమాత్రం మాట్లాడటంలేదు. శ్రీదేవిని మీడియా, జాన్వీ కెరీర్‌ గురించి ప్రశిస్తే, సరైన సమాధానం దొరకడంలేదు. 'నా సినిమా ప్రమోషన్‌ గురించి వచ్చాను కాబట్టి, నా సినిమా గురించే అడగండి' అనంటోంది శ్రీదేవి. 'మామ్‌' శ్రీదేవి ప్రాణం పెట్టి చేసిన సినిమా. ఆమె భర్త బోనీకపూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సకుటుంబ సమేతంగా 'మామ్‌' ప్రమోషన్‌లో కనిపిస్తూ సందడి చేయడం తప్ప, మీడియా ఆశించిన సమాధానాలు మాత్రం దొరక్కుండా చేయగలుగుతున్నారు. అలనాటి అందాల నటి శ్రీదేవి ఇలా ఎందుకు వ్యవహరిస్తోందో అర్థం కాక మీడియా జనాలు జుట్టుపీక్కోవాల్సి వస్తోంది. అయితే సమయం సందర్భం వచ్చినప్పుడు జాన్వీ గురించి మాట్లాడతాననీ, మీడియాతో చెప్పకుండా జాన్వీ సినీ కెరీర్‌ ముందుకు వెళ్ళబోదని శ్రీదేవి అంటోంది. 

 

ALSO READ: బ‌న్నీ మాస్ట‌ర్ ప్లాన్ తో రూ.5 కోట్లు లాభం