ENGLISH

ఫిదా కొత్త రికార్డు సృష్టించింది

08 October 2017-12:11 PM

శేఖర్ కమ్ముల తాజా చిత్రం ఫిదా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సంచలనం సంగతి మనందరికీ విదితమే. అయితే ఈ చిత్రం అటు వెండితెరపైనే కాకుండా ఇటు బుల్లితెరపైన కూడా రికార్డుల మోత మోగించింది.

వివరాల్లోకి వెళితే- ఫిదా చిత్రం దసరా పండగ సందర్భంగా బుల్లితెరలో వేయడం జరిగింది. ఆ సందర్భంలో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో 21.30 టీఆర్పీ రేటింగ్స్ రావడం జరిగింది. దీనితో రెండు తెరల పైన సంచలనం సృష్టించిన చిత్రంగా ఈ ఫిదా చిత్రం పేరు రీకార్డులకి ఎక్కింది.

ఇదిలావుండగా కలెక్షన్స్ పరంగా ఫిదా సినిమా ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఏదైతేనేమి శేఖర్ కమ్మల చాలా కాలం గ్యాప్ తీసుకుని మరి చేసిన చిత్రమైన తన మార్కుని ఏమాత్రం తప్పకుండా బాగా తీయగలిగాడు.

ALSO READ: వెయిట్ చేయమంటున్న పవన్ కళ్యాణ్