ENGLISH

ఎఫ్‌ఎన్‌సీసీ తరఫున వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల విరాళం

26 September 2024-15:35 PM

ఎఫ్‌ఎన్‌సీసీ తరఫున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో సమావేశమై, వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎన్‌సీసీ ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు గారు, సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి గారు, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు గారు పాల్గొన్నారు.


ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. విజయవాడ ప్రాంతంలో ముఖ్యంగా బుడమేరు నది పొంగిపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. సినీ ప్రముఖులు మరియు ఇతర రంగాలకు చెందిన అనేక మంది ఇప్పటికే సహాయ కార్యక్రమాలలో భాగమవుతుండగా, ఎఫ్‌ఎన్‌సీసీ కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చింది.


ఈ సందర్భంగా ఎఫ్‌ఎన్‌సీసీ ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు గారు మాట్లాడుతూ, ఎఫ్‌ఎన్‌సీసీ ఎల్లప్పుడూ సహాయ కార్యక్రమాలలో ముందుండి సహాయం అందిస్తుందని చెప్పారు. సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి గారు కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేసి, రెండు రాష్ట్రాల సీఎం లు ఎఫ్‌ఎన్‌సీసీ సభ్యులను అభినందించినట్లు తెలియజేశారు.