ENGLISH

కల్కి దారిలోనే దేవర ఓటీటీ

26 September 2024-13:58 PM

ఎన్టీఆర్ దాదాపు ఆరేళ్ళ తరువాత దేవరతో సోలోగా వస్తున్నారు. దీనితో దేవర పై అంచనాలు పీక్స్ కి చేరాయి. అనుకున్నట్టుగానే దేవర రికార్డ్స్ సృష్టిస్తూ ఎన్టీఆర్ క్రేజీని అమాంతం పెంచుతోంది. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా 'దేవర' కి క్రేజ్ పెరుగుతోంది. ఇప్పటికే లాస్ యాంజిల్స్ వెళ్లిన తారక్ అక్కడ తన సత్తా చూపిస్తూ హాలీవుడ్ ప్రేక్షుకుల మనసు గెల్చుకుంటున్నాడు. దేవర జోరు చూడటానికి ఇంకా కొన్ని గంటల మాత్రమే ఉంది. విదేశాల్లో కొన్ని చోట్ల ఇప్పటికే ప్రీమియర్ షోలు పడ్డాయి. ఫాన్స్ దేవర చూసి ఉర్రూత లూగుతున్నారు. ప్రతి సినిమాకు నెగిటీవ్ రివ్యూ ఇచ్చే ఉమైర్ సందు అనే మూవీ క్రిటిక్ కూడా దేవర కి పాజిటీవ్ రివ్యూ ఇవ్వటం గమనార్హం. 


తారక్ నటన ఒక రేంజ్ లో ఉందని కీర్తించాడు. తెలుగు రాష్ట్రాల్లో దేవర సందడి రేపటి నుంచి మొదలు కానుంది. దేవర మార్కెట్ కూడా దేశ విదేశాల్లో రికార్డ్ సృష్టిస్తోంది. దేవర ధియేటర్ బిజినెస్ తో పాటు,  ఓటీటీ రైట్స్ కూడా అమ్ముడయ్యాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేవర OTT పార్ట్నర్ ఎవరు, ఈ మూవీ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్, అన్న చర్చ జరుగుతోంది.  జనరల్ గా పాన్ ఇండియా సినిమాలు OTT స్ట్రీమింగ్ కి సౌత్ లో పెద్దగా కండీషన్స్ లేవు. కానీ హిందీలో మల్టీప్లెక్స్ లో మూవీ రన్ అవ్వాలంటే ఆ థియేటర్స్ అసోసియేషన్ పెట్టిన ఓటీటీ రిలీజ్ కండిషన్స్ ఫాలో అవ్వాలి. థియేటర్స్ లో రిలీజ్ చేసిన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని నార్త్ మల్టీప్లెక్స్ ఓనర్స్ రూల్స్.  


అందుకే ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ మూవీ 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. అదే మన సౌత్ సినిమాలు అయితే నాలుగు వారాల గ్యాప్ లోనే OTT లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. నాని నటించిన సరిపోదా శనివారం మూవీ వచ్చి నెల రోజులు అయ్యిందో లేదో అప్పుడే OTT లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి కారణం థియేటర్స్ బిజినెస్ తో సమానంగా OTT రైట్స్ కూడా అమ్ముడవటమే.  ఇప్పుడు దేవర కూడా నార్త్ మల్టిపెక్స్ రూల్స్ ప్రకారం 8 వారల తరవాతే OTT స్ట్రీమింగ్ ఉంటుందని సమాచారం.  దాదాపు నవంబర్ ఎండింగ్ నుంచి దేవర ఓటీటీలో చూడొచ్చు.