ENGLISH

రంగీలా హీరోయిన్.. విడాకుల స్టోరీ

25 September 2024-14:28 PM

ఊర్మిళా మతోండ్కర్ అంటే గుర్తుకు రాకపోయినా రంగీలా హీరోయిన్ 'యాయిరే....యాయీరే వారేవా ఇది ఏం జోరే' పాట వినగానే అంతా గుర్తు పడతారు. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తరవాత హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. బాలీవుడ్ తో పాటు తెలుగు తమిళం సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మొదట 'గాయం' సినిమాతో పరిచయం అయ్యింది. రామ్ గోపాల్ వర్మ  దర్శకత్వంలో జపతిబాబు, రేవతి నటించిన ఈ మూవీలో ఊర్మిళ కూడా కీలక పాత్రలో కనిపించింది. తరవాత రామ్ గోపాల్ వర్మ కి ఫేవరేట్ గా మారి ఆయనతో వరుస సినిమాలు చేసింది. 


రంగీలా మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ నాగార్జున తో వర్మ తెరకెక్కించిన అంతం మూవీలో, జేడీ చక్రవర్తితో అనుకోకుండా ఒకరోజు, సత్య.  తమిళంలో కమల్ హాసన్, శంకర్ కాంబో మూవీ భారతీయుడులో నటించింది ఊర్మిళ. తరవాత  క్రమంగా సినిమాలకి దూరం అయిపోయింది. తన తోటి నటులంతా పెళ్లి చేసుకుని సెటిల్ అయినా ఊర్మిళ మాత్రం పెళ్లి చేసుకోలేదు చాలా ఏళ్ళు ఒంటరిగానే గడిపింది. కొన్నాళ్ళకి ఒక పెళ్ళిలో కలిసిన వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. 8 ఏళ్ళ తరవాత డివోర్స్ కావాలంటూ కోర్టు కెక్కటం సంచలనంగా మారింది. 


2014లో ఓ పెళ్లిలో కశ్మీరి బిజినెస్‌మ్యాన్ 'మోసిన్ అక్తర్‌' ని కలిసింది. ఆ పరిచయం ప్రేమగా మారి రెండేళ్ల తరవాత 2016 లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటివరకు బాగానే ఉన్న ఈ జంట ఈ మధ్య విడి విడిగా ఉంటున్నారు. నాలుగు నెలల క్రితం కోర్టులో విడాకుల కోసం ఊర్మిళ అప్లై చేసిందన్న విషయం ఇప్పుడు బయటపడింది. కారణం ఊర్మిళ మళ్ళీ కెరియర్ కొనసాగించాలని, సెకండ్ ఇన్నింగ్స్ కోసం రెడీ అయ్యిందట, దానికి భర్త నో చెప్పటంతో అతనితో విడిపోవాలని నిర్ణయం తీసుకుని డివోర్స్ కి అప్లై చేసింది. భర్త వారిస్తున్నా ఊర్మిళ వినలేదంట. డివోర్స్ మోసిన్ కి అసలు ఇష్టం లేదని సమాచారం.