ENGLISH

Geeta Arts: జాక్ పాట్ కొట్టిన గీతా ఆర్ట్స్

15 October 2022-14:10 PM

క‌న్న‌డ‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన సినిమా `కాంతారా`. తెలుగులో కాస్త‌ ఆల‌స్యంగా డ‌బ్ చేసి, అదే పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల‌లోనూ రిలీజ్ చేసింది.

 

తొలిరోజు, తొలి షోకే మంచి టాక్ వ‌చ్చేసింది. చాలా థియేట‌ర్ల‌లో ఈ సినిమా హౌస్ ఫుల్ అయ్యింది. తెలుగు హీరో సినిమాకి ఎంత ఓపెనింగ్ వ‌స్తుందో, ఈ సినిమాకీ అంతే ఓపెనింగ్ వ‌చ్చింది. రిష‌బ్ శెట్టి ఈ సినిమాని హీరో. ఆయ‌నే ద‌ర్శ‌కుడు. రిష‌బ్ శెట్టి అంటే తెలుగులో ఎవ‌రికీ పెద్ద‌గా తెలీదు. త‌ను న‌టించిన `బెల్ బోట‌మ్` సినిమా ఆహాలో విడుద‌లైంది. అంతే.. థియేట‌ర్లో నేరుగా విడుద‌లైన సినిమా ఇదే. అయినా స‌రే, ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావ‌డం.. ఆశ్చ‌ర్యాన్నిక‌లిగిస్తోంది.

 

క‌న్న‌డ‌లో రిలీజ్ అయి, హిట్ట‌యిన‌ప్పుడే.. తెలుగులోనూ ఈ సినిమా గురించి మాట్లాడుకొన్నారు. అందుకే.. ఈ రోజు ఇంత మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ఈ వారం పెద్ద‌గా సినిమాలేం విడుద‌ల కాలేదు. అందుకే కాంతారాకి అది ప్ల‌స్ అవుతుంది. మ‌రోవైపు ప్ర‌భాస్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ లాంటి టాలీవుడ్ సెల‌బ్రెటీలు ఈ సినిమా చూసి, పాజిటీవ్ రివ్యూలు ఇచ్చారు. ఈ వీకెండ్ లో `కాంతారా` బాక్సాఫీసు ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్లు ద‌క్కించుకొనే అవ‌కాశం ఉంది. అలా.. గీతా ఆర్ట్స్ సంస్థ జాక్ పాట్ కొట్టేసిన‌ట్టే.

ALSO READ: 'క్రేజీ ఫెలో’ మూవీ రివ్యూ & రేటింగ్!