ENGLISH

Kantara Review: ‘కాంతార’ మూవీ రివ్యూ & రేటింగ్!

15 October 2022-12:33 PM

నటీనటులు : రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిశోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి తదితరులు
రచన, దర్శకత్వం : రిషబ్ శెట్టి 
ఛాయాగ్రహణం : అరవింద్ ఎస్. కశ్యప్ 
సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్‌
తెలుగులో విడుదల : అల్లు అరవింద్
నిర్మాత : విజయ్ కిరగందూర్


రేటింగ్ : 3.25/5


కేజీఎఫ్ తో కన్నడ పరిశ్రమ పాన్ ఇండియాలో ఉనికి చాటుకుంది. తర్వాత 777చార్లీ, విక్రాంత్ రోణా చిత్రాలు దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాయి. ఇప్పుడు  ‘కాంతార’ పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రమిది. ‘కేజీయఫ్‌’  ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించింది. గత నెలలో కన్నడలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. దాంతో ఈ చిత్రాన్ని మిగతా భాషల్లోనూ డబ్‌ చేశారు. గీతా ఆర్ట్స్‌ ఈ సినిమాని తెలుగు విడుదల చేసింది. గత నెల కొన్నాళ్ళుగా ఎక్కడ విన్నా  ‘కాంతార’ పేరే వినిపిస్తుంది. మరి ఇంత టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచిన కాంతారాలో ఏముంది? 


కథ :


అనగనగా ఒక రాజు. రాజ్యం, సంపద.. అన్నీ వున్నా మ‌నశ్శాంతి లేకపోవడం అతనికి లోటు. దిని కోసం దేశమంతా తిరుగుతుండగా ఓ అడవిలో అతనికి ఓ శిల కనిపిస్తుంది. దాన్ని చూశాక అతనిలో తెలియని మ‌నశ్శాంతి కలుగుతుంది. అందుకే ఆ శిలను తనకు ఇచ్చేయమని అక్కడి ఊరి ప్రజల్ని కోరతాడు. దానికి బదులుగాకొంత భూమిని ఆ ఊరి ప్రజలకు దానం ఇస్తాడు. ఆ సమయంలో దైవం ఆవహించిన ఓ మనిషి రాజుకు ఓ కండీషన్ పెడతాడు. దేవుడికిచ్చిన భూమిని తిరిగి లాక్కునే ప్రయత్నం చేయకూడదు.  మాట తప్పితే దైవాగ్రహానికి గురికాక తప్పదు'' అని హెచ్చరిస్తాడు. అలాగే అంటాడు రాజు. రాజు కాలం ముగుస్తుంది. రాజు తదనంతరం రాజ వంశీకులైన దేవేంద్ర (అచ్యుత్‌ కుమార్‌) తమ భూముల్ని తిరిగి దక్కించుకునేందుకు ఓ కుట్ర పన్నుతాడు. మరి ఆ కుట్ర ఏంటి? దాన్ని శివ (రిశభ్ శెట్టి ) ఎలా అడ్డుకున్నాడు? దేవుడు పెట్టిన షరతుని అతిక్రమించిన వారికి ఎలాంటి పరిస్థితి ఎదురైయిందనేది మిగతా కథ. 


విశ్లేషణ:


రాజు, అడవి, దేవుడు, పూనకం.. ఈ సెటప్ అంతా చందమామ,  జానపద కథల్లో వుంటుంది. ‘కాంతార' ఈ కూడా  టైపు కథే. ‘కాంతార' అంటే అడవి. అయితే ఈ అడవి మిస్టీరియస్ గా వుంటుంది. రాజు కథతో మొదలైన ‘కాంతార' .. శివ దగ్గరికి వచ్చేసరికి సోషల్ కథగా మారుతుంది. అడవిని ప్రభుత్వానికి అప్పగించడానికి వచ్చిన పోలీసు, దానం చేసిన భూమిని లాక్కోవడానికి చూస్తున్న రాజు వంశీకులు, అడవి దేవుడు ఇచ్చిన హక్కుగా బ్రతికే అక్కడి ప్రజలు.. ఈ మూడు పొరల్లో కథ నడుస్తూ వుంటుంది. తొలి సగంలో కథ ముందుకు పెద్దగా కదలదు. ఒక సగటు కమర్షియల్ హీరో టైపులో శివ పరిచయ సన్నివేశాలు, స్నేహితులతో వేటకెళ్ళడం, దొర, పోలీసు పాత్రల చుట్టూ సన్నివేశాలు.. ఎక్కడా బోర్డ్ కొట్టకుండా నడిపారు. ఇంత సీరియస్ కథలో స్నేహితుల పాత్రల రూపంలో మంచి కామెడీని రాబట్టుకున్నాడు దర్శకుడు. 


సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత వచ్చే సన్నివేశాలు మళ్ళీ సాదారణంగానే వుంటాయి. గురివి పాత్ర హత్య తర్వాత ‘కాంతార' అసలు కథ మొదలౌతుంది. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ లో ‘కాంతార' ఒక్కసారిగా ఎవరెస్ట్ అంత ఎత్తులో కనిపిస్తుంది.  సినిమా మొత్తం ఒకెత్తైతే.. చివరి 20నిమిషాలు మరోకెత్తు. విలన్ కి.. ఊరి ప్రజలకు మధ్య జరిగే యాక్షన్‌ ఎపిసోడ్‌  హాయ్ వోల్టేజ్ ఫీలింగ్ ఇస్తుంది. ఆఖర్లో తన పాత్రలోకి దైవం ఆవహించాక రిషబ్‌ కనబర్చే నటన గూస్ బంప్స్ తెస్తుంది. ఈ ఎపిసోడ్ విశ్వరూపమే. సినిమా బిగినింగ్ నుండి శివకి వినిపించే 'అరుపు' ఆఖర్లో అరిపించేసింది. ఈ ఎపిసోడ్ దగ్గరే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ కి ధీటుగా వుంటుంది కాంతారా. 
 

నటీనటులు :


నటుడిగా, దర్శకుడిగా సినిమాకిఆయుపట్టు   రిషబ్‌ శెట్టి.  క్లైమాక్స్ లో అతని నటన అద్భుతం. హీరోయిన్ సప్తమి గౌడ చాలా సహజంగా కనిపించింది. దొర పాత్రలో అచ్యుత్ మంచి నటన కనబరిచారు. కిషోర్ పాత్ర కూడా బావుంటింది. తెరపై కనిపించిన పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా వున్నాయి. 


సాంకేతిక వర్గం :


అరవింద్‌ ఛాయాగ్రహణం బ్రిలియంట్ గా వుంది.  అజనీష్‌ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వారహ పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉండటమే కాదు.. మిగింపుకి ప్రాణం పోషించి.  నిర్మాణ విలువలు వున్నంతంగా వున్నాయి. 


ప్లస్ పాయింట్స్ 


రిషబ్‌ శెట్టి నటన దర్శకత్వం 
కథా నేపధ్యం 
నేపధ్య సంగీతం , నిర్మాణ విలువలు 


మైనస్ పాయింట్స్ 


కథలోకి త్వరగా వెళ్లకపోవడం 
సెకండ్ హాఫ్ లో కొన్ని సాగదీత సీన్స్ 


ఫైనల్ వర్దిక్ట్ :  కాంతారా.. చూడాల్సిందే

ALSO READ: జాక్ పాట్ కొట్టిన గీతా ఆర్ట్స్!