ENGLISH

గని పై కాపీ మరక

14 December 2021-18:20 PM

టాలీవుడ్‌లో క‌థ‌ల కాపీల ప‌ర్వం కొన‌సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య క‌థ కాపీ వివాదం ఇంకా స‌మిసిపోకుండానే.. మెగాస్టార్ ప్యామిలీ నుంచి మ‌రో మూవీ క‌థ కాపీ వివాదం తెర‌పైకి వ‌చ్చింది. మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్‌ యాక్షన్‌ చిత్రం ‘గని’. క‌థ కాపీ కొట్టార‌నే వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

 

బాక్సింగ్‌ నేపథ్యంలో కిరణ్‌ కొర్రపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మాతగా ఈ చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నారు. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సయూ మంజ్రేకర్ హీరోయిన్ కాగా.. క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర, జగపతి బాబు, నదియా, నరేశ్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందించిన గ‌ని చిత్రం ఈనెల 24న థియేట‌ర్ల‌లో ఈ సినిమా విడుద‌లకు సిద్ధ‌మవుతోంది. ఇప్పటికే విడుదలైన ‘గని’ టీజర్లు, పాటలు ఆకట్టుకున్నాయి. అయితే, ఈ సినిమా స్టోరీ త‌న‌ద‌ని, గీతా ఆర్ట్స్‌కాపీ కొట్టింద‌ని ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ వరంగల్ కు చెందిన యువకుడు ప్ర‌దీప్ మ‌డూరి ఆరోపిస్తున్నారు. ఈ స్టోరీని మూడేళ్ల క్రితం అల్లు బాబీకి తాను వినిపించాన‌ని, క‌థ న‌చ్చడంతో సినిమా తీద్దామ‌ని హామీ కూడా ఇచ్చార‌ని చెప్పారు.

 

త‌న నుంచి పూర్తి స్క్రిప్ట్ తీసుకుని.. త‌ర్వాత దూరంగా ఉంచారని పేర్కొన్నారు. ట్రైలర్ లో చూపించిన డైలాగులతో పాటు.. సినిమా కథ మొత్తం తనదేనంటూ ఆ యువకుడు ఆధారాలతో హై కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. కాగా, ఆస్ట్రేలియా లోని ప్రముఖ యూనివర్సిటీ నుంచి సినిమాటోగ్రఫీలో పోస్ట్ గ్రాడ్యూవెట్ చేసిన ప్ర‌దీప్ మ‌డూరి.. ఆస్ట్రేలియాలో హాలీవుడ్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఇతడు తీసిన లఘు చిత్రం ది బుక్.. రెండేళ్ల క్రితం బెంగళూరులో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సాధించింది. ప్ర‌ముఖ వెట‌ర‌న్ క్రికెట‌ర్ బ్రియ‌న్ లారీ జీవిత చ‌రిత్ర‌పై డాక్య‌మెంట‌రీ తీస్తున్నాడు.

ALSO READ: వెల్ డ‌న్ నాగ్‌... నాగ్ చేస్తున్న అతి గొప్ప ప‌ని ఇదే!