ENGLISH

మార్చిలో కూడా రానంటున్న 'గ‌ని'

02 March 2022-10:39 AM

వ‌రుణ్‌తేజ్ `గ‌ని` గా సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. కిర‌ణ్ కొర‌పాటి ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్త‌య్యింది. ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించారు. కానీ భీమ్లా నాయ‌క్ రావ‌డంతో... వెన‌క‌డుగు వేసింది చిత్ర‌బృందం. మార్చి 4న వ‌స్తామ‌ని మ‌రో డేట్ చెప్పింది. అయితే ఇప్పుడు కూడా రావ‌డం లేదు. ఆ మాట‌కొస్తే... `గ‌ని` మార్చిలో అస్స‌లు రావ‌డమే లేదు. ఎందుకంటే మార్చి అంతా పెద్ద సినిమాల హ‌డావుడి క‌నిపిస్తోంది. ఈనెల 11న రాధే శ్యామ్ వ‌స్తున్నాడు. 25న ఆర్‌.ఆర్‌.ఆర్ రెడీ అవుతోంది. సో.. మార్చిలో ఖాళీ లేన‌ట్టే.

 

అందుకే ఏప్రిల్ 8న రాడానికి సిద్ధ‌మ‌య్యాడు గ‌ని. ఈ మేర‌కు చిత్ర‌బృందం కొత్త రిలీజ్ డేట్ ని బ్లాక్ చేసిన‌ట్టు స‌మాచారం. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి కీల‌క పాత్రలు పోషించిన చిత్రమిది. వ‌రుణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆ బ‌డ్జెట్ రాబ‌ట్టుకోవాలంటే సోలో... రిలీజ్ త‌ప్ప‌నిస‌రి. అందుకే మంచి డేట్ కోసం చిత్ర‌బృందం ఎదురు చూస్తోంది. ఏప్రిల్ 8 మంచి డేటే. మిగిలిన సినిమాల నుంచి పోటీ ఏం లేదు. అది దాటితే మాత్రం. ఏప్రిల్ లో పెద్ద సినిమాలు వ‌రుస క‌ట్టేస్తాయి. సో.. ఏప్రిల్ 8న గ‌ని రావాల్సిందే.

ALSO READ: భీమ్లా నాయక్ పై కొత్త వివాదం