ENGLISH

భీమ్లా నాయక్ పై కొత్త వివాదం

01 March 2022-15:25 PM

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌భంజ‌నం కొన‌సాగుతోంది. ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లైన భీమ్లా నాయ‌క్ బాక్సాఫీసు ద‌గ్గ‌ర దూసుకుపోతోంది. త్వ‌ర‌లోనే వంద కోట్ల మైలు రాయిని అందుకోనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఓ వివాదం చెల‌రేగింది.

 

ఈ సినిమాలో కుమ్మరి కులస్థుల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఓ స‌న్నివేశం ఉంద‌ని, వెంట‌నే దాన్ని తొలగించాలని.. లాలాపేట్‌ పోచమ్మ దేవాలయ సభ్యుడు ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. సోమవారం కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. తామూ ఎంతో పవిత్రంగా భావించే కుమ్మరి చక్రాన్ని ఓ సన్నివేశంలో రానా కాలితో తన్నడం కుమ్మరులను కించపరిచే విధంగా ఉందని ఆయన ఆరోపించారు. అంతేకాదు, వెంటనే ఈ సన్నివేశాలను సినిమాలో నుంచి తొలగించాలని పురుషోత్తం డిమాండ్ చేశారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

ALSO READ: బాల‌య్య‌కే `నో` చెప్తుందా?