ENGLISH

బాల‌య్య‌కే `నో` చెప్తుందా?

01 March 2022-11:11 AM

ఎందుకో తెలీదు గానీ, ముందు నుంచీ బాల‌కృష్ణ సినిమాలంటే క‌థానాయిక‌ల స‌మ‌స్యే. టాప్ హీరోయిన్లు ఎవరూ బాల‌య్య సినిమా అంటే అందుబాటులో లేకుండా పోతారు. కుర్ర హీరోయిన్ల‌కు తీసుకొస్తే అంత క్రేజ్ రాదు. ప్ర‌తీ సినిమాకీ ఇదే స‌మ‌స్య‌. ఇప్పుడు బాల‌య్య కొత్త సినిమాకీ ఎదురైంది. అయితే ఇది వ‌ర‌కు హీరోయిన్ పాత్ర‌ల‌కు నో చెప్పేవాళ్లు. ఇప్పుడు బాల‌య్య కూతురు పాత్ర‌కీ అదే తీరు.

 

నంద‌మూరి బాల‌కృష్ణ - గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాల‌య్య కూతురి పాత్ర ఒక‌టుంది. క‌థ‌లో చాలా కీల‌కం. ఆ పాత్ర కోసం శ్రీలీల‌ని ఎంచుకున్న‌ట్టు స‌మాచారం. అయితే నిజానికి ఈ పాత్ర కోసం `ఉప్పెన‌` ఫేమ్ కృతి శెట్టిని అనుకున్నారు. కృతిని సంప్ర‌దిస్తే...`బాల‌య్య సినిమాలోనా.. అమ్మ‌బాబోయ్‌` అంద‌ట‌. ఆ త‌ర‌వాత కాల్షీట్లు లేవ‌ని చెప్పేసింద‌ట‌. బాల‌య్య సినిమాలో న‌టించ‌డానికి భ‌య‌మా? లేదంటే నిజంగానే కాల్షీట్లు లేవా? అనేదే పెద్ద ప్ర‌శ్న‌గా మారిపోయింది. మ‌రోవైపు శ్రీ‌లీల ప‌రిస్థితి కూడా ఇంతే. శ్రీ‌లీల `చేస్తా` అని చెబుతోంది కానీ, డేట్లు స‌ర్దుబాటు చేయ‌డం లేదు. త‌ను కూడా హ్యాండ్ ఇస్తుందేమో అనుకుంటున్నారంతా.

ALSO READ: 100 కోట్ల‌తో.. నాగ్ 100వ సినిమా