ENGLISH

మాస్ కాదు .. ఇది మెగా మాస్‌!

01 March 2022-10:08 AM

చిరంజీవి అంటేనే మాస్‌. అర‌వై ఏళ్ల వ‌య‌సులోనూ ఆయ‌న మాస్ ని మెస్మ‌రైజ్ చేయ‌డం మాన‌లేదు. ఆచార్య త‌ర‌వాత రాబోతున్న గాడ్ ఫాద‌ర్ సినిమాలో ఆయ‌న కాస్త క్లాసీ లుక్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఆ వెంట‌నే.. త‌న మెగా మాస్ ని చూపించేయ‌నున్నాడు. `భోళా శంక‌ర్‌`లో.

 

చిరు కొత్త చిత్రం 'భోళా శంకర్`. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మహా శివరాత్రి పండుగ సందర్భంగా 'భోళా శంకర్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. చేతిలో త్రిశూలం ఉన్న చైను తిప్పుతూ, జీపు ముందు స్టైలీష్ గా కూర్చున్న చిరు పోస్ట‌ర్ అది. చూస్తుంటేనే ఈ సినిమాలో త‌న పాత్ర ఎంత మాసీగా ఉండ‌బోతోందో అర్థ‌మ‌వుతోంది. తమిళంలో అజిత్ కుమార్ హీరోగా నటించిన హిట్ మూవీ 'వేదాళం' రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. త‌మ‌న్నా క‌థానాయిక‌. కీర్తి సురేష్ చిరు చెల్లాయిగా న‌టిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ALSO READ: 100 కోట్ల‌తో.. నాగ్ 100వ సినిమా