ENGLISH

సాహో ద‌ర్శ‌కుడికి ఆఫ‌ర్ ఇచ్చిన ప‌వ‌న్‌

28 February 2022-14:00 PM

సాహో కి ముందు సుజిత్ పేరు మార్మోగిపోయింది. ఓ చిన్న సినిమా తీసి, వెంట‌నే ప్ర‌భాస్ తో ప‌నిచేయ‌గ‌ల‌గ‌డం, అందులోనూ రూ.400 కోట్ల భారీ ప్రాజెక్ట్ అంటే మాట‌లు కాదు. అందుకే.. హీరోలు, నిర్మాత‌లంద‌రి చూపూ సుజిత్ పై ప‌డింది. అయితే.. సాహో త‌ర‌వాత సుజిత్ ని ఎవ‌రూ పట్టించుకోలేదు. వ‌చ్చిన ఆఫ‌ర్ల చేజారాయి. ఎట్ట‌కేల‌కు సుజిత్ కి ఓ బంప‌ర్ ఛాన్స్ ద‌క్కింది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో త‌ను ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

 

`వినోద్యాయ సీత‌మ్‌` అనే ఓ సినిమాని ప‌వ‌న్ రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. డివివి దాన‌య్య నిర్మాత‌. ఈచిత్రానికి సుజిత్ ని ద‌ర్శ‌కుడిగా ఎంచుకున్నార‌ని టాక్‌. ఈ యేడాది చివ‌ర్లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. `భీమ్లా నాయ‌క్‌` చిత్రానికి స్క్రీన్ ప్లే, మాట‌లు స‌మ‌కూర్చారు త్రివిక్ర‌మ్. ఈ చిత్రానికీ ఆయ‌న స‌హాయ స‌హ‌కారాలు ఉంటాయ‌ని తెలుస్తోంది. క‌థ‌లో మార్పులు, చేర్పుల ఘ‌ట్టానికి ఇప్ప‌టికే తెర లేచింద‌ని, భీమ్లా ప‌నులు పూర్త‌యిన వెంట‌నే త్రివిక్ర‌మ్, ఈ సినిమా రీమేక్ లో ప‌డ్డార‌ని స‌మాచారం అందుతోంది.

ALSO READ: బాకీ తీర్చేసుకున్న త్రివిక్ర‌మ్‌