ENGLISH

మూడు రోజుల్లో కుమ్మేసిన భీమ్లా

28 February 2022-11:23 AM

భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన `భీమ్లా నాయ‌క్‌` తొలి రోజు, తొలి షోకే సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆ జోరు.. మూడు రోజుల పాటు కొన‌సాగుతూనే ఉంది. శ‌నివారం వ‌సూళ్లు కాస్త డ్రాప్ అయిన‌ట్టు అనిపించినా, ఆదివారం మ‌ళ్లీ హోస్ ఫుల్ బోర్డులు క‌నిపించాయి. సోమ‌వారం నుంచి ఈ సంద‌డి ఎలా ఉంటుంద‌న్న‌దాన్ని బ‌ట్టి, భీమ్లా రేంజు ఆధార‌ప‌డి ఉంటుంది. మంగ‌ళ‌వారం శివ‌రాత్రి సెల‌వు... భీమ్లాకి క‌లిసొచ్చే విష‌యం. తొలి మూడు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో క‌లిపి దాదాపు రూ.51 కోట్ల షేర్ సాధించింది. నైజాంలో 24 కోట్లు, సీడెడ్‌లో 7.25 కోట్లు తెచ్చుకున్న హ‌బీమ్లా ఆంధ్రాలో మాత్రం కాస్త నెమ్మ‌దించింది.

 

 

భీమ్లా తొలి మూడు రోజుల వ‌సూళ్లు

 

నైజాం రూ.24 కోట్లు

సీడెడ్ 7.25 కోట్లు

ఉత్త‌రాంధ్ర 4.4 కోట్లు

గుంటూరు 3.87 కోట్లు

ఈస్ట్ 3.6 కోట్లు

కృష్ణ 2.3 కోట్లు

వెస్ట్ 3.9 కోట్లు

నెల్లూరు 1.8 కోట్లు

మొత్తంగా: రూ.51 కోట్లు

ALSO READ: సునీల్‌కి అన్యాయం చేసిన త్రివిక్ర‌మ్‌