ENGLISH

సినిమా రిలీజ్ కి ముందే తండ్రయిన హీరో

14 June 2017-12:42 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయిన ఘంటా శ్రీనివాస రావు కుమారుడు ఘంటా రవి తండ్రయ్యాడు.

నేటి ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఘంటా రవి భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. ఘంటా రవి రెండేళ్ళ క్రితం మంత్రి నారాయణ కుమార్తెని పెళ్లి చేసుకున్న విషయం విదితమే.

ఇక ఘంటా రవి నటించిన జయదేవ్ చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ప్రముఖ దర్శకుడు జయంత్ ఈ చిత్రానికి దర్శకత్వం చేశాడు. మొత్తానికి ఈ యంగ్ హీరో తన చిత్రం రిలీజ్ కి ముందే తండ్రి అవ్వడంతో హీరో అవ్వకముందే తండ్రి అయిన హీరోల క్లబ్ లో ఘంటా రవి చేరిపోయాడు.

 

ALSO READ: షాకింగ్‌: నటనకు గుడ్‌ బై చెప్పిన మనోజ్‌