ENGLISH

స్టైలిష్‌గా దూసుకొచ్చేస్తున్న 'గౌతమ్‌ నందా'

12 June 2017-12:48 PM

గోపీచంద్‌ కొత్త సినిమా 'గౌతమ్‌ నందా'. సంపత్‌ నంది డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. మంచి రెస్పాన్స్‌ అందుకుంటోంది. మాస్‌ డైరెక్టర్‌ అయిన సంపత్‌ నంది స్క్రీన్‌పై రిచ్‌ లుక్‌ని మెయింటైన్‌ చేయడంలోనూ దిట్ట. అదే ఫార్ములా 'గౌతమ్‌ నందా'లోనూ ఫాలో అయినట్లు ఆర్దమవుతోంది. టీజర్‌ చాలా రిచ్‌గా కట్‌ చేశాడు. స్టార్టింగ్‌ నుండి, ఎండింగ్‌ వరకూ టీజర్‌ చాలా రిచ్‌గా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కేథరీన్‌, హన్సిక. కేథరీన్‌ చాలా హాట్‌గా కనిపిస్తోంది టీజర్‌లో. రోజ్‌ పెటల్స్‌ నిండిన స్విమ్మింగ్‌ పూల్‌లో చాలా కలర్‌ఫుల్‌గా స్విమ్‌ చేస్తూ కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. హన్సిక సాధారణ యువతిలా కనిపిస్తోంది. సంపత్‌ నంది సినిమాలో యాక్షన్‌ సీన్స్‌కి ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాదు గోపీచంద్‌ కటౌట్‌కి యాక్షన్‌ సీన్స్‌ సూపర్బ్‌గా సెట్‌ అయిపోతాయి. ఈ సినిమాలో గోపీచంద్‌ రెండు గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. గెడ్డంతో స్టైలిష్‌గా కనిపిస్తున్న లక్‌ ఒకటి. గెడ్డం లేకుండా మరో గెటప్‌. ఈ రెండు గెటప్స్‌లోనూ గోపీచంద్‌ తన హ్యాండ్‌ సమ్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో పక్క గోపీచంద్‌ నటించిన 'ఆక్సిజన్‌' సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. రాశీ ఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్‌ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

 

ALSO READ: కొడుతున్నాం, కొట్టేస్తున్నాం: బన్నీ కాన్ఫిడెన్స్‌