ENGLISH

గోపీచంద్‌ 'ఆక్సిజన్‌' పక్కా మాస్‌ గురూ!

01 October 2017-08:43 AM

ఓ అందమైన కుటుంబం, ఆ కుటంబానికి అనుకోకుండా కలిగిన ఓ ఆపద. ఆ ఆపద నుండి హీరో తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనేదే 'ఆక్సిజన్‌' స్టోరీ. టైటిల్‌ని బట్టి ఇదో సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ అనుకున్నారంతా. కానీ ట్రైలర్‌ వచ్చాక పక్కా మాస్‌ సినిమా అని అర్ధమవుతోంది. ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయ దశమి సందర్భంగా ఈ రోజు 'ఆక్సిజన్‌' ట్రైలర్‌ విడుదలైంది. చాలా కూల్‌గా స్టార్ట్‌ చేసి, ట్రైలర్‌ని పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌లా మార్చేశాడు డైరెక్టర్‌. ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మాస్‌ స్టోరీలు గోపీచంద్‌కి బాగా సెట్‌ అవుతాయి. యాక్షన్‌ సీక్వెన్సెస్‌ చాలా బాగున్నాయి. మనోడు యాక్షన్‌ హీరో కదా. యాక్షన్‌ సీన్స్‌ ఇరగదీసేసినట్లు తెలుస్తోంది ట్రైలర్‌ ద్వారా. గోపీచంద్‌ లుక్‌ కూడా చాలా బాగుంది. ఇద్దరు ముద్దుగుమ్మలు రాశీఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఇద్దరూ గ్లామర్‌లో పోటీ పడుతున్నారు. నువ్వా నేనా అన్న రేంజ్‌లో ఉంది ఈ ముద్దుగుమ్మల గ్లామర్‌. ట్రైలర్‌లోనే ఇలా ఉంటే ఇక సినిమాలో ఏ రేంజ్‌లో ఉండబోతోందో. విజువల్‌గా చాలా రిచ్‌గా కనిపిస్తోంది. జగపతిబాబు గోపీచంద్‌ తండ్రిగా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ట్రైలర్‌ వచ్చాక సినిమాపై అంచనాలు బాగున్నాయి. చాలా ప్రామిసింగ్‌గా ఉంది ట్రైలర్‌. సూపర్‌ హిట్‌ కళ కన్పిస్తోంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: Qlik Here For Oxygen Movie Trailer