సెలబ్రిటీస్ వారసులు కూడా సెలబ్రిటీలు కావాలని అభిమానులు కోరుకుంటుంటారు. అందులో తప్పు పట్టడానికి లేదు. అయితే అందరు సెలబ్రిటీల వారసులు సెలబ్రిటీలే కావాలని రూల్ అయితే లేదు కదా. తల్లి తండ్రులుగా తమ పిల్లలు ఇది కావాలి, అది కావాలి అని కలలు కంటుంటారు తల్లితండ్రులు. అది సహజమే.
అయితే డాక్టర్ పిల్లలు డాక్టర్సే కావాలి అని కోరుకోకపోయినా, యాక్టర్ పిల్లలు మాత్రం యాక్టర్స్ కావాలని అనుకుంటుంటారు. ఎందుకంటే తమ అభిమాన నటీ నటుల వారసులు కూడా నటులుగా అలరించాలని అనుకుంటారు అభిమానులు. అలాగే అలనాటి నటి గౌతమి కూతురు సుబ్బలక్ష్మి హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తోందంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదనీ, తన కూతురు ప్రస్తుతం చదువుకుంటోందనీ, సినిమాలపై తనకు పెద్దగా ఆశక్తి లేదనీ చెబుతోంది గౌతమి. అలా అని మొత్తానికి తాను నటించదని కూడా క్లారిటీ ఇవ్వడం లేదు గౌతమి. ఇప్పటికైతే చదువుపై కాన్‌సన్‌ట్రేషన్ చేస్తోంది.
ఒకవేళ భవిష్యత్తులో ఆమెకు సినిమాలపై ఆశక్తి కలిగితే అప్పుడు తప్పకుండా తెరంగేట్రం చేస్తుంది అని గౌతమి చెబుతోంది. గతేడాది నుండీ సుబ్బలక్ష్మిపై ఈ వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది విక్రమ్ హీరో ధృవ్ హీరోగా వస్తున్న 'వర్మ' సినిమాలో సుబ్బలక్ష్మి నటిస్తోందంటూ తాజాగా గాసిప్స్ వస్తున్నాయి. ఆ వార్తల్నే గౌతమి ఖండించింది. అభిమానులకు తన వల్ల తన కూతురు పట్ల ఉన్న అభిమానానికి ఆమె మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపింది.
ALSO READ: ప్రముఖ గాయని చిన్మయికి లైంగిక వేధింపులు