ENGLISH

'సైరా' టీమ్‌ ఏం చేస్తోందో తెలుసా?

14 June 2018-17:23 PM

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' కోసం భారీ యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరణ జరుగుతోంది. శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. హైద్రాబాద్‌ శివార్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో ఈ యాక్షన్‌ సీన్స్‌ని షూట్‌ చేస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ గ్రేగ్‌ పావెల్‌ నేతృత్వంలో ఈ యాక్షన్‌ ఘట్టాలను అదిరిపోయేలా చిత్రీకరిస్తున్నారు సైరా టీమ్‌. 

తెలుగు జాతిని అణచివేసేందుకు బ్రిటీష్‌ సైన్యం ఓ చోట బలమైన ఆయుధాలను దాచి ఉంచగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన అనుచరులతో కలిసి వారిని తెలివిగా మట్టు పెట్టి, ఆయుధాల్ని స్వాధీనం చేసుకునే క్రమంలో ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ ఉంటుందట. ఈ యాక్షన్‌ ఘట్టాన్నే ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఔట్‌ పుట్‌ అనుకున్నదాని కన్నా చాలా బాగా వస్తోందట. సినిమాకి అత్యంత కీలకమైన యాక్షన్‌ ఎపిసోడట ఇది. ఇలాంటివి సినిమాలో ఇంకా చాలానే ఉంటాయట. 

ఈ తరహా యాక్షన్‌ సీన్స్‌ కోసమే మెగాస్టార్‌ చిరంజీవి తన 60 ఏళ్ల వయసును మరిచిపోయి, వర్కవుట్స్‌ చేశారు. అంతేకాదు, డూప్స్‌ లేకుండా యాక్షన్‌ సీన్స్‌లో నటిస్తుండడం చూసి, టీమ్‌ మొత్తం షాకవుతున్నారట. చిరంజీవి ఎనర్జీకి, డెడికేషన్‌కి అంతా అవాక్కయిపోతున్నారట. ఆయన ఎనర్జీ టీమ్‌ మొత్తానికి సరికొత్త ఉత్సాహాన్నిస్తుందనీ చిత్ర యూనిట్‌ చెబుతోంది. 

సురేందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి 150వ చిత్రాన్ని రూపొందించిన కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నాడు.

ALSO READ: నా నువ్వే రివ్యూ & రేటింగ్