ENGLISH

'ప్రియ'మైన బ్రాండ్‌ అంబాసిడర్‌

14 June 2018-17:00 PM

సెలబ్రిటీస్‌కి పబ్లిసిటీనే ప్రాణం. ఎంత పబ్లిసిటీ ఉంటే, అంత పాపులర్‌ అవుతూ ఉంటారు సెలబ్రిటీస్‌. అయితే ఎలాంటి పబ్లిసిటీ లేకుండానే సెన్సేషనల్‌ అయిపోయింది ముద్దుగుమ్మ ప్రియా వారియర్‌. జస్ట్‌ ఓ వీడియోతో ఈడా ఆడా కాదు, దేశం మొత్తం పాపులర్‌ అయిపోయిందీ ముద్దుగుమ్మ. ఇంత పాపులారిటీ వచ్చాక ఆగుతారా? 

భాషతో సంబంధం లేకుండా, సినిమాలతో బిజీ అయిపోవడమే కదా తరువాయి. కానీ అలా చేయలేదీ మలయాళ కుట్టీ. అవకాశాలు వరదలా పొంగుకొస్తున్నా, సింపుల్‌గా రిజక్ట్‌ చేసేస్తోంది. ఫస్ట్‌ స్టడీస్‌ నెక్ట్స్‌ ఇంకేదైనా అని గట్టిగా బల్ల గుద్ది చెప్పేస్తోంది ప్రియా. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్‌. అమ్మడి పాపులారిటీని ఎలాగైనా వాడుకోవాలనే కొన్ని వాణిజ్య సంస్థలు తమ సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండమనీ, ప్రియా వారియర్‌కు లక్షలు, కోట్లలో రెమ్యునరేషన్‌ ఇచ్చి మరీ పిలుచుకుంటున్నారు. అయితే సినిమాలకు నో చెబుతున్న ఈ అమ్మడు వాణిజ్య ప్రకటనలకు సై అంటోంది. అయితే చదువుకోవాలనే ఆలోచన ఉన్నా, తనకొచ్చిన పాపులారిటీని వదులుకునే యోచనలో మాత్రం లేదు ప్రియా. 

అందుకే ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లుగా బెస్ట్‌ యోచన చేసింది. ఓన్లీ యాడ్స్‌కే సైన్‌ చేస్తోంది. కానీ సినిమాలు ఇప్పుడప్పుడే కాదంటోంది. కుప్పలు తెప్పలుగా యాడ్స్‌లో నటించేసిందిప్పటికే ఈ ముద్దుగుమ్మ. తాజాగా సౌత్‌లో మరో ప్రముఖ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ తీసుకుందట ప్రియా వారియర్‌.

ALSO READ: నా నువ్వే రివ్యూ & రేటింగ్