ENGLISH

బాలయ్య - హరీష్ కాంబోలో మలయాళ రీమేక్

07 January 2025-12:48 PM

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వలన ఈ మూవీ ఇంకా పూర్తి కాలేదు. ఈ క్రమంలో హరీష్, రవితేజ తో 'మిస్టర్ బచ్చన్' చేసి రిలీజ్ చేసారు. ఈ మూవీ హిందీలో వచ్చిన అజేయ దేవగన్ 'రైడ్' కి రీమేక్. కానీ ఆశించిన స్థాయిలో మిస్టర్ బచ్చన్ ఆకట్టుకోలేదు. మళ్ళీ హరీష్ పవన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ లోగా కథలు రెడీ చేసుకుంటున్నాడు. తన నెక్స్ట్ మూవీ మెగాస్టార్ చిరంజీవి తో ఉంటుంది అని ఆ మధ్య పేర్కొన్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ కెరియర్లో ఎక్కువగా మెగా హీరోలతోనే వర్క్ చేసాడు.

పవన్ కళ్యాణ్, బన్నీ, వరుణ్ తేజ్ లాంటి హీరోలతో కలిసి వర్క్ చేసిన హరీష్ ద్రుష్టి ఇప్పుడు నందమూరి హీరోలపై పడింది. ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్యతో సినిమా చేసేందుకు హరీష్ ఆసక్తి చూపిస్తున్నాడు. హరీష్ లాంటి మాస్ యాక్షన్ దర్శకుడుకి బాలయ్య లాంటి స్టార్ దొరికితే 'దబిడి దిబిడే'. హరీష్ మొదట రామ్ పోతినేని కోసం ట్రై చేశాడని కానీ కుదరలేదని, ఈ నేపథ్యంలో హరీష్ ద్రుష్టి బాలయ్య పై పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టాడని, లాస్ట్ స్టేజ్ లో ఉందని సమాచారం.

ఇంతకముందు కూడా హరీష్, బాలయ్య కాంబో మూవీపై వార్తలు వచ్చాయి కానీ సెట్ అవలేదు. ఇప్పుడు పక్కా అని టాక్. రీమేక్ కథలనే నమ్ముకునే హరీష్ ఈ సారి కూడా బాలయ్యతో రీమేక్ ట్రై చేయనున్నారని తెలుస్తోంది. గత ఏడాది మలయాళం వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఆవేశం' రీమేక్ చేయనున్నారని సమాచారం. పుష్ప ఫేమ్ ఫాహద్ ఫాజిల్ నటించిన ఆవేశం మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇపుడు ఇదే మూవీని బాలయ్యతో రీమేక్ చేయనున్నాడు హరీష్ అని ఫిలిం నగర్ టాక్. నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం.

ALSO READ: ఎన్టీఆర్ - నీల్ కాంబోలో మలయాళ సూపర్ స్టార్స్