అల్లు అర్జున్ నటించిన 'పుష్ప2 ' మూవీ ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉన్న రికార్డ్స్ బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు పుష్ప రాజ్. బాలీవుడ్ లో హయ్యెస్ట్ గ్రాస్ కలక్షన్స్ తో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఖాన్ లు , కపూర్లు పుష్ప రాజ్ రికార్డ్స్ ముందు బలాదూర్ అయిపోయారు. ఒక సౌత్ సినిమా బాలీవుడ్ లో 800 కోట్లు దాటి కలక్ట్ చేయటం అంటే మాములు విషయం కాదు. ఇప్పడు ఇంకొక కొత్త రికార్డ్ కూడా క్రియేట్ చేసాడు బన్నీ.
ఇప్పడు బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసి తగ్గేదేలే అని దంగల్ రికార్డ్ వైపు పరుగుతీస్తున్నాడు పుష్ప రాజ్. ఈ విషయాన్ని టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. పుష్ప 2 మూవీ 32 రోజుల్లోనే 1831 కోట్ల కలక్షన్స్ తో బాహుబలి 2 ని వెనక్కి నెట్టింది. దీంతో ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యథిక వసూళ్లు రాబట్టిన సెకండ్ మూవీగా పుష్ప 2 నిలిచింది. ఫస్ట్ ప్లేస్ లో అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ ఉంది. దంగల్ 2000 కోట్లు వసూల్ చేసింది. దంగల్ తరవాత 1810 కోట్లతో ప్రభాస్ బాహుబలి 2 సినిమా ఉండేది. కానీ ఇప్పుడు పుష్ప 2 బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేసింది.
ఈ విషయం తెలిసిన బన్నీ ఫాన్స్ కేరింతలు కొడుతున్నారు. త్వరలోనే దంగల్ రికార్డ్ ని కూడా బ్రేక్ చేసి బన్నీ ఆల్ టైం హయ్యెస్ట్ కలక్షన్స్ తో రారాజుగా వెలగాలని కోరుకుంటున్నారు. ఇది తెలుగు సినిమా సాధించిన ఘనత అని చెప్పాలి. కానీ నిజమైన ఆనందం దంగల్ రికార్డ్ బ్రేక్ చేసినప్పుడు కలుగుతుంది. బాహుబలి, అయినా పుష్ప అయినా తెలుగు సినిమానే కదా అన్నది కొందరి భావన.
ALSO READ: బాలయ్య - హరీష్ కాంబోలో మలయాళ రీమేక్