ENGLISH

బన్నీ వివాదాలకు చెక్ పెట్టినట్టేనా?

07 January 2025-14:13 PM

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక ఫ్యామిలీకి చెందిన రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కొడుకు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటినుంచి కోమాలో ఉన్న శ్రీ తేజ్ కి ప్రస్తుతం బేగంపేట కిమ్స్ హాస్పటల్ లో ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. తాజాగా శ్రీ తేజ్ ని అల్లు అర్జున్ వెళ్ళి పరామర్శించారు. బన్నీ హాస్పటల్ కి వెళ్లే క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగా రాంగోపాల్ పేట పోలీసుల‌కు ఇన్ఫార్మ్ చేసారు. దీంతో హాస్పటల్ దగ్గర పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లు తనపై నమోదైన కేసు కారణంగా వెళ్ళి శ్రీ తేజ్ ని పరామర్శించ లేకపోయాడు బన్నీ. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ మంజూరి అవటంతో పోలీసుల దగ్గరనుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకుని హాస్పటల్ కి వెళ్ళి శ్రీతేజ్ ని చూసి వచ్చాడు.

ఇప్పటివరకు బన్నీ పై వచ్చిన విమర్శల్లో ఇది కూడా ఉంది. ఇన్సిడెంట్ జరిగిన తరువాత వారి ఫ్యామిలీని బన్నీ కలవలేదని, శ్రీ తేజ్ ని కూడా పరామర్శించలేదని పలువురు విమర్శించారు. బన్నీ వెళ్ళటానికి పర్మిషన్ లేనందునే అల్లు అరవింద్ ఒక సారి వెళ్ళి కలిసి వచ్చారు. బన్నీ తరపున కోటి రూపాయల నష్ట పరిహారం అందించారు. ఇప్పడు బన్నీ కూడా శ్రీతేజ్ ని చూసి ఆరోగ్య ప‌రిస్థితి గూర్చి డాక్టర్స్ ని సంప్రదించారు. అంతే కాదు శ్రీతేజ్ కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని హామీ కూడా ఇచ్చారు. బన్నీతో పాటు తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్ రాజు కూడా వెంట ఉన్నారు.

తాజా సంఘటనల నేపథ్యంలో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టేనా? అని చర్చ జరుగుతోంది. ఎందుకంటే బన్నీ ఇప్పటికే తన తప్పు ఒప్పుకున్నాడు. పోలీసులు కూడా చట్టం ముందు అందరూ సమానమే అని ప్రూవ్ చేసి కేసు ఫైల్ చేసి బన్నీని అరెస్ట్ చేసారు. అల్లు అర్జున్ ఫ్యామిలీ రేవతి కుటుంబాన్ని కలిసి ఆర్ధిక సాయం ప్రకటించింది. కుటుంబానికి అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చింది. బన్నీ ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ పై ఉన్నాడు. ఇక నైనా ఈ విషయం సద్దు మనిగినట్లే అని అంతా భావిస్తున్నారు.

ALSO READ: బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసిన పుష్ప 2