ENGLISH

Harish Shankar: ప‌వ‌న్‌ని వ‌దిలేసి... విజ‌య్‌తో క‌లిసి...!

02 November 2022-11:00 AM

ప‌వ‌న్ క‌ల్యాణ్ - హ‌రీష్ శంక‌ర్ ల కాంబినేష‌న్‌లో `భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌` అనే సినిమా ప్ర‌క‌టించి చాలా కాలమైంది. అయితే ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌డం వ‌ల్ల ఈసినిమాకి డేట్లు కేటాయించ‌లేక‌పోయాడు. హ‌రీష్ మాత్రం... ప‌వ‌న్ ఎప్పుడోక‌ప్పుడు త‌నని పిలిచి ఛాన్స్ ఇస్తాడ‌ని ఎదురు చూశాడు. నెల‌లు గ‌డిచిపోయాయి కానీ.. ప‌వ‌న్ నుంచి పిలుపు రాలేదు. దాంతో.. హ‌రీష్ ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి పూర్తిగా బ‌య‌ట‌కు వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ సినిమాని వదిలేసి, మిగిలిన ప్రాజెక్టుల‌పై దృష్టి పెట్ట‌డానికి హ‌రీష్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం. అందులో భాగంగా... విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడ‌ని టాక్‌. విజ‌య్ తో హ‌రీష్ ట‌చ్‌లో ఉన్నాడ‌ట‌. క‌థ‌కు సంబంధించిన చ‌ర్చ‌లు కూడా జోరుగా సాగుతున్నాయ‌ని టాక్‌.

 

దిల్ రాజు బ్యాన‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ సినిమా చేయాలి. హ‌రీష్ కు కూడా.. దిల్ రాజు అంటే సొంత బ్యాన‌ర్ అన్న‌ట్టు లెక్క‌. సో.. అందుకే ఈ కాంబో ఈజీగా సెట్ట‌యిపోయింద‌ని టాక్‌. అయితే... ప‌వ‌న్ కోసం రాసుకొన్న క‌థ వేరు... ఈ క‌థ వేరు. ప‌వ‌న్ తో చేయాల్సిన సినిమాని అలానే ప‌క్క‌న పెట్టాడ‌ట‌. ఎప్ప‌టికైనా ప‌వ‌న్ క‌నిక‌రిస్తే.. ఆ క‌థ ప‌ట్టాలెక్కించాల‌న్న ఆశ‌తోనే ఉన్నాడు హ‌రీష్‌.

ALSO READ: రెండు సినిమాల‌కూ రూ.60 కోట్లా..?