ENGLISH

RRR: ఆర్ఆర్ఆర్ సీన్ రిపీట్ చేస్తున్న పుష్ప‌

02 November 2022-10:46 AM

RRR లో ఒళ్లు జ‌ల‌ద‌రించే సీన్లు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో... కొమ‌రం భీమ్ - పులితో ఫైట్ ఒక‌టి. పులిని కొమ‌రం భీముడు వేటాడి... బంధించే సీన్ RRR లోని ఒకానొక హైలెట్‌. ఇది వ‌ర‌క‌టి సినిమాల్లో పులి, సింహాల‌తో హీరో ఫైటింగులు చేయ‌డం చూశాం. అవ‌న్నీ బొమ్మ పులులే అనే సంగ‌తి స్ప‌ష్టంగా తెలిసిపోతుంటుంది. అయితే సీజీల రాక‌తో నిజం పులితోనే ఫైట్ చేస్తున్నార‌న్న ఫీలింగ్ క‌లిగిస్తున్నారు ద‌ర్శ‌కులు. దాంతో ఆయా సీన్లు బాగా పండుతున్నాయి.

 

ఇప్పుడు పుష్ప2 లోనూ.. అలాంటి సీన్ ఒక‌టి ఉంద‌ట‌. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `పుష్ప‌` ఎంత పెద్ద హిట్ట‌య్యిందో తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 త‌యార‌వుతోంది. ఇందులో పుష్ప కీ పులికీ మ‌ధ్య భీక‌ర‌మైన పోరు ఒక‌టుంది. ఆ సీన్‌ని విదేశాల్లో తీయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. విదేశాల్లో ప్ర‌త్యేక శిక్ష‌ణ పొందిన పుల‌లు ఉంటాయి. వాటిని మ‌చ్చిక చేసుకోవ‌డం చాలా సుల‌భం. అందుకే ఈ సీన్ విదేశాల్లో ప్లాన్ చేస్తున్నార్ట‌. సాధార‌ణంగా ఇలాంటి స‌న్నివేశాల్ని సీజీలో పూర్తి చేస్తారు. కానీ రియ‌లిస్టిక్ గా ఉండాల‌ని నిజం పులితోనే పుష్ప ఫైట్ చేయ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమాకి ఈ సీన్ హైలెట్ కానుంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: రెండు సినిమాల‌కూ రూ.60 కోట్లా..?