ENGLISH

మాట నిలబెట్టుకుంటాం: హరీష్‌ శంకర్‌

14 June 2017-12:04 PM

హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న అల్లు అర్జున్‌ మూవీ 'డీజె - దువ్వాడ జగన్నాధమ్‌' సినిమాలో 'నమకం, చమకం ' అనే పద ప్రయోగంతో సాగే పాట బ్రాహ్మణ కులాన్ని కించపరిచే విధంగా ఉన్నాయంటూ, బ్రాహ్మణ సంఘాలు వివాదానికి దిగిన సంగతి తెలిసిందే. తామెంతో పవిత్రంగా భావించే ఆ పదాలను శృంగార పాట కోసం వినియోగించారన్న వారి వాదనకు డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ వివరణ ఇస్తానని చెప్పినా ఈ వివాదం సమసిపోలేదు. ఆ పాట నుండి ఆ పదాలను ఇమీడియట్‌గా తొలగించాలంటూ వాదనకు దిగారు బ్రాహ్మణ సంఘాలు. ఆ పదాలను తొలగించకుండా సినిమా విడుదల జరగనివ్వమంటూ బ్రాహ్మణ సంఘాలు అడ్డు పడుతుండడంతో గొడవ పెద్దది చేసుకోవడం ఎందుకని చిత్ర యూనిట్‌ సినిమా నుండి ఆ పదాలను తొలగించినట్లుగా ప్రకటించింది. అయితే ఆడియోకి సంబంధించి మొదటి బంచ్‌ సీడీలు ఇదివరకే తయారయిన కారణంగా అందులో వాటిని మార్చలేము. కానీ రెండో బంచ్‌ సీడీల్లో ఆ పదాలను తొలగించి సీడీలు విడుదల చేస్తామని డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ భరోసా ఇచ్చారు. అంతేకాదు సినిమాలో ఆ పదాలు ఉండవని కూడా ఆయన చెప్పారు. ఈ ఆలస్యానికి కారణం, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ న్యూజీలాండ్ లో ఉండడంతో ఈ మార్పు జరగలేదు అని చెబుతున్నారు. అలాగే సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం మించకుండా ఈ సినిమా ఉంటుందనీ హరీష్‌ శంకర్‌ హామీ ఇచ్చారు. ఈ సినిమాతో హరీష్‌ రచయితగా కూడా మారారట. క్లైమాక్స్‌ కొత్తగా రూపొందించారట. ఈ ప్రయోగం మంచి విజయం తెచ్చిపెడ్తుందని హరీష్‌ ఆశిస్తున్నాడు. అలాగే సూపర్‌ హిట్‌ పక్కా అనే బన్నీ చెప్పిన మాట కూడా నిలబెట్టుకుంటామని హరీష్‌ అంటున్నాడు.

ALSO READ: బన్నీ సినిమాకి అన్ని కోట్లు మిగిలిపోతాయా?