ENGLISH

హాట్‌ కుమారి.. అవార్డ్‌ విన్నింగ్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చేసిందట.!

18 November 2020-15:20 PM

హాట్‌ బ్యూటీ హెబ్బా పటేల్‌ అనగానే.. ‘అబ్బా..’ అనేంత హాట్‌ అప్పీల్‌ గుర్తుకొస్తుంటుంది. తెలుగులో ఇప్పటిదాకా ఆమె చేసిన సినిమాలు అలాంటివి మరి. అయితే, ఈసారి గేర్‌ మార్చి, అవార్డ్‌ కొట్టేస్తానంటోంది ‘కుమారి’ హెబ్బా పటేల్‌. ‘కుమారి 21 ఎఫ్‌’ సినిమాతో పాపులర్‌ అయిన ఈ బ్యూటీ, ‘ఓదెల రైల్వే స్టేషన్‌’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం విదితమే.

ప్రముఖ దర్శకుడు సంపత్‌ నంది ఈ చిత్రానికి కథ అందించాడు. దర్శకుడు అశోక్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటిదాకా తాను చేసిన సినిమాలన్నిటికంటే భిన్నంగా ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ సినిమాలో తన పాత్ర వుంటుందని హెబ్బా పటేల్‌ చెబుతోంది. మరోపక్క, హెబ్బా పటేల్‌ ఎంపిక వెనుక సంపత్‌ నందికి ఆమెపై వున్న నమ్మకమే కారణమంటున్నారు. సినిమా స్టిల్స్‌లో హెబ్బా పటేల్‌ విపరీతంగా ఎట్రాక్ట్‌ చేసేస్తోంది. ఆమె లుక్‌ని అంత బాగా డిజైన్‌ చేశారు.

ఓ పల్లెటూరి యువతి పాత్రలో హెబ్బా పటేల్‌ కనిపిస్తోంది. ‘గ్లామరస్‌ పాత్రలు ఎన్నో చేసినా, ఈ సినిమాలోని నా పాత్ర చాలా చాలా ప్రత్యేకం. ఖచ్చితంగా నా పాత్రకు మంచి పేరొస్తుంది. నటన పరంగా నన్ను చాలా కొత్తగా చూడబోతున్నారు..’ అని హెబ్బా పటేల్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. షూటింగ్‌ స్పాట్‌లో హెబ్బా పటేల్‌ నటనా ప్రతిభను చూసినవారంతా ‘వారెవ్వా..’ అంటున్నారట. ఇదిలా వుంటే, దర్శకుడిగా సంపత్‌ నంది ‘సీటీమార్‌’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. గోపీచంద్‌, తమన్నా జంటగా నటిస్తున్నారు ఈ సినిమాలో.

ALSO READ: Hebah Patel Latest Photoshoot