ENGLISH

డేటింగులో ఉన్న మ‌జా... పెళ్లిలో లేదంటా..!?

18 November 2020-14:00 PM

స‌హ‌జీవ‌నం అన్న‌ది మ‌రీ అత్యంత మామూలైపోయింది. ముఖ్యంగా చిత్ర‌సీమ‌లో. హీరో, హీరోయిన్లు డేటింగులో ఉండ‌డం, కొన్నాళ్లు చెట్టా ప‌ట్టాలేసుకుని తిర‌గ‌డం - స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యాలు. తాప్సి కూడా ఇలానే డేటింగులో ఉంది. ఓ బ్యాట్మెంటెన్ క్రీడా కారుడితో కొన్నాళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తోంది. షూటింగుల‌కు ఏమాత్రం గ్యాప్ వ‌చ్చినా, మూడ్ బాగోక‌పోయినా.. ప్రియుడితో క‌లిసి షికార్లు మొద‌లెట్టేస్తోంది.

 

ఇటీవ‌లే మ‌ల్దీవులు వెళ్లొచ్చింది తాప్సి. ఆ ఫొటోలు, వీడియోలూ సోష‌ల్ మీడియాలో బాగానే వైర‌ల్ అయ్యాయి. త‌న ప్రియుడి గురించి, అత‌నితో ప్రేమాయ‌ణం గురించి అంత‌గా స్పందించ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని తాప్సి తొలిసారి నోరు విప్పింది. అదీ.. పెళ్లి విష‌యంలో.

 

''పెళ్లి .. అన్న ఆలోచ‌న ఇప్ప‌టి వ‌ర‌కూ రాలేదు. అదెప్పుడు జ‌రుగుతుందో నాక్కూడా తెలీదు. అయినా పెళ్లి చేసుకోవాల‌న్న కంగారు నాకేం లేదు. ప్ర‌స్తుతానికి ఒక‌రికొక‌రు అర్థం చేసుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నాం'' అంటూ లైట్ తీసుకుంది. డేటింగులో ఉన్న మ‌జా.. పెళ్లిలో లేద‌ని తాప్సి ఫిక్స‌య్యిందేమో..? మ‌రి బంధం ఎంత కాల‌మో చూడాలి.

ALSO READ: RRR పై క‌రోనా ఎఫెక్ట్‌... ఇలాగైతే క‌ష్ట‌మే!