ENGLISH

హీరో ఆఫ్‌ ది ఇయర్‌ ఎవరో తెలుసా.?

31 December 2020-17:30 PM

2020 సంవత్సరానికి సంబంధించి హీరో ఆఫ్‌ ది ఇయర్‌ ఎవరు.? అన్న ప్రశ్నకి కోలీవుడ్‌లో ఒకలా, బాలీవుడ్‌ ఒకలా, టాలీవుడ్‌లో ఇంకొకలా సమాధానం చెప్పొచ్చు. కానీ, అందరి నోటా వచ్చే ఒకే ఒక్క పేరు సోనూ సూద్‌ మాత్రమే. ఔను, సోనూ సూద్‌ 2020 సంవత్సరానికిగాను 'హీరో' అని చెప్పక తప్పదు. వెండితెరపై విలన్‌ వేషాలు ఎక్కువగా వేసే సోనూ సూద్‌, నిజానికి చాలా మంచివాడు. ఎంత మంచివాడంటే, ఎవరు ఆపదలో వున్నా, వెంటనే అక్కడ సోనూ సూద్‌ సాయం వాలిపోతుంటుంది. ఔను, ఇది నిజం. తనకన్నా ముందు తన సాయం, అవసరమైనవారికి అందుతుందన్న భరోసా సోనూ సూద్‌ ఇవ్వగలిగాడు.

 

అసలెలా ఇంత సొమ్ము అతనికి వస్తోంది.? అంటే, సినీ పరిశ్రమ సహా ఇతరత్రా వ్యాపకాల ద్వారా సంపాదించిన సంపాదనంతా ఈ సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నాడు సోనూ సూద్‌. అంతకు ముందు కూడా సోనూ సూద్‌ ఎంతోమందికి సాయమందించాడు. కరోనా వేళ మాత్రం సోనూ సూద్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.

 

ప్రభుత్వాలు సైతం చేయలేని సాయాన్ని సోనూ సూద్‌ చేశాడని నిస్సందేహంగా చెప్పొచ్చు. అందుకే, సోనూ సూద్‌ 2020 సంవత్సరానికి సంబంధించి 'రియల్‌ హీరో' అయ్యాడు. బహుశా అందుకేనేమో, అతన్ని విలన్‌గా పెట్టి సినిమాలు తీయాలంటే దర్శక నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ఔను, హీరో పర్సనాలిటీ సంపాదించుకున్న సోనూ సూద్‌ని విలన్‌గా ఎవరూ ఊహించుకోలేరు మరి.

ALSO READ: హాకీ స్టిక్ ప‌ట్ట‌నున్న చైతూ