ENGLISH

న్యూస్ పేపర్ పై సెటైర్స్ వేసిన ప్రముఖ హీరో

06 June 2017-18:36 PM

ప్రముఖ హీరో హ్రితిక్ రోషన్ ఒక ప్రముఖ న్యూస్ పేపర్ పైన సెటైర్ వేయడం ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళితే, హ్రితిక్ ఒక ఫ్యాన్ తో అనుచితంగా ప్రవర్తించాడు అని అలాగే బలవంతంగా అతని మొబైల్ ఫోన్ ని ఫార్మేట్ చేసేశాడు అని ఆ పత్రిక ఒక కధనం ప్రచురించింది.

హ్రితిక్ దీనపై తన ట్విట్టర్ లో స్పందిస్తూ- ఊహాకల్పితమైన కథనాలు ప్రచురిస్తూ ఊహల్లో ఉన్న ఆ పత్రికా యాజమాన్యం భూమిపైకి వచ్చాక తనని కలిస్తే దీనిపైన సవివరణ ఇస్తానని చురక వేశాడు.

చూద్దాం.. హ్రితిక్ చేసిన కామెంట్ పై ఆ సదరు పత్రిక ఎలా స్పందిన్చనుందో...

 

ALSO READ: త్రివిక్రమ్‌ - పవన్‌ పవర్‌ అదే