ENGLISH

గ్లామ్‌ షాట్‌: ఆహా ఊర్వశి ఏమి అందం నీది

06 June 2017-17:52 PM

రంభ, ఊర్వశి, మేనక వంటి అందాల రాశుల పేర్ల పక్కన ఈ ముద్దుగుమ్మ పేరు చేర్చేంత అందంగా ఉంది ఈ చిత్రం చూస్తుంటే. బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి ఈమె పేరు. ఈ అందాల రాశి బాలీవుడ్‌లో ఎక్కువగా ఐటెం సాంగ్స్‌లోనూ, వ్యాంప్‌ క్యారెక్టర్స్‌లోనూ మాత్రమే మెరిసింది ఇంతవరకూ. ఈ ఫోటోలో ఆమె అందం చూస్తుంటే దివి నుండి దిగి వచ్చిన దేవకన్యలానే అనిపిస్తోంది. మోడలింగ్‌ రంగం నుండి వచ్చిన ఈ ముద్దుగుమ్మకి ఇప్పుడు పర్‌ఫామెన్స్‌ రోల్స్‌లో నటించాలని ఉందంటోంది. అందులో భాగంగా తన అందాన్ని అంతటినీ ఇలా పోగు చేసి రాజసంగా కనువిందు చేస్తోంది. ఈ పోజు చూసిన వారెవరైనా సరే ఆహా ఊర్వశి ఏమి నీ అందం అనక మానరు సుమీ!

 

ALSO READ: Qlik Here For Urvashi Rautela Latest Photos