ENGLISH

'ఉయ్యాలవాడ' భారీ ఊపందుకుందయ్యా

06 June 2017-17:48 PM

చిరంజీవి హీరోగా 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా అనుకున్నప్పట్నుంచీ, మీడియా తెరమరుగై పోయిన 'ఉయ్యాలవాడ' జీవిత గాధని తెలుసుకునేందుకు అత్యుత్సాహం చూపిస్తోంది. అవును నిజమే, ఓ స్వాతంత్ర సమరయోధుడి జీవిత గాధ. జనానికి తెలియాల్సింది.. చరిత్రలో కలిసిపోయింది. స్వాతంత్రం వచ్చి, ఇప్పుడింత హాయిగా జీవిస్తున్నామంటే అది ఆనాడు ఉయ్యాలవాడ వంటి పోరాట యోధుడి పుణ్యమే. కర్నూలు జిల్లాకి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూలాలను వెతికేందుకు చాలా రీసెర్చ్‌ జరుగుతోంది. నిజానికి ఇది ఇప్పటి రీసెర్చ్‌ కాదు. చాలా కాలంగా ఈ సినిమాపై రీసెర్చ్‌ మొదలైంది. అప్పట్నుంచీ చరిత్రని తవ్వి తీస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఈ సినిమాకి దృశ్యరూపం పొందే భాగ్యం కలిగింది. అప్పుడెప్పుడో పరుచూరి బ్రదర్స్‌ ఈ సినిమాకి స్టోరీ ప్రిపేర్‌ చేసి పెట్టారు. ఆ స్టోరీనే కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు చిరంజీవితో తెరకెక్కిస్తున్నారు. చిరంజీవికి 151వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 150వ సినిమాని తెరకెక్కించిన రామ్‌ చరణే ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చారిత్రక గాధని చరణ్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా టేకప్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో నటించాలని చిరంజీవి ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. అది ఇప్పటికి నెరవేరబోతోంది. ఈ సినిమా కోసం చిరంజీవి పూర్తి మేకోవర్‌ అయ్యారు. ఆగష్టులో ఈ సినిమాని సెట్స్‌ మీదికి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్‌ యోచిస్తోంది. 

ALSO READ: చిరుతో.. విజ‌య‌శాంతి?