ENGLISH

'మామ్‌' అంతకుమించి..

06 June 2017-17:46 PM

విలువలతో కూడిన సినిమాలు చాలా అరుదుగా వస్తూంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి శ్రీదేవి ప్రధాన పాత్రలో వస్తోన్న 'మామ్‌' సినిమా అని చెప్పక తప్పదు. ఇది ఒక సినిమా మాత్రమే కాదు. ఓ తల్లి తపన. కేవలం దీన్ని ఓ సినిమాగా మాత్రమే అనలేము. అంత గొప్ప స్టోరీతో తెరకెక్కుతోన్న సినిమా కాబట్టే ఈ సినిమాకి ఒప్పుకున్నాను అంటూ శ్రీదేవి చెబుతోంది. ఇద్దరు పిల్లల తల్లిగా అమ్మతనం అంటే ఏంటో నాకు పూర్తిగా తెలుసు. ఆ అమ్మతనాన్ని నేను ఈ సినిమాలో నటించలేదు. జీవించాను. ఇప్పటికీ ఈ పాత్రలో నన్ను నేను రియల్‌గా ఊహించుకుంటూనే ఉంటాను. అంతగా ఈ పాత్ర నాపై ప్రభావం చూపించింది. నేను పొందిన ఈ అనుభూతిని తెరపై నన్ను చూస్తున్న ప్రతీ తల్లి పొందుతుంది. షూటింగ్‌ జరిగినంత కాలం ఇదో సినిమా షూటింగ్‌ అన్న భావనే తనకి కలగలేదు అంటోంది అలనాటి మేటి నటి శ్రీదేవి. శ్రీదేవి రీ ఎంట్రీలో వస్తోన్న సినిమా ఇది. గతంలో 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌', 'పులి' తదితర చిత్రాల్లో నటించింది శ్రీదేవి. కానీ 'మామ్‌' సినిమా రీ ఎంట్రీలోనే కాదు, టోటల్‌ తన సినీ కెరీర్‌కే ప్రత్యేకం అంటోంది. హిందీతో పాటు తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదలవుతోంది ఈ సినిమా. శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ట్రైలర్‌ చూస్తుంటేనే శ్రీదేవి ఈ సినిమాలో ఎంత పేషన్‌తో నటించిందో తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందకు రానుంది. 

ALSO READ: 'డిజె'లో నమకం, చమకం లేనట్టే