ENGLISH

త్రివిక్రమ్‌ - పవన్‌ పవర్‌ అదే

06 June 2017-17:40 PM

పవన్‌ కళ్యాణ్‌ వరుసగా రెండు సినిమాలతో ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్‌ చేశాడు. 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' ఆశించినంత విజయం అందుకోలేదు. భారీ అంచనాల నడుమ వచ్చిన 'కాటమరాయుడు' కూడా తీవ్రంగా నిరాశ పరిచింది. సో పవన్‌ కళ్యాన్‌ నుండి రాబోయే తదుపరి చిత్రంపైనే ఫ్యాన్స్‌ ఆశలన్నీ. త్రివిక్రమ్‌తో పవన్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై విడుదలకి ముందే అంచనాలు నెలకొన్నాయి. ట్రేడ్‌ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ మార్కెట్‌కే బోలెడన్ని అంచనాలు వేసేస్తున్నారు. ఇంతవరకూ 'బాహుబలి' సినిమా విడుదలకి ముందు భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత పవన్‌ కళ్యాన్‌ సినిమానే ఆ స్థాయి వసూళ్లు సాధించేది అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. అదే పవన్‌ స్టామినా అంటే. పవన్‌ సినిమాలకి జయాపజయాలతో సంబంధం ఉండదు. అందులోనూ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌. ఈ కాంబినేషన్‌ అంటే ఓవర్సీస్‌లో మంచి క్రేజ్‌ ఉంటుంది. డైరెక్టర్‌గా త్రివిక్రమ్‌కీ, హీరోగా పవన్‌కీ సెపరేటుగా రికార్డులున్నాయి అక్కడ. 'అత్తారింటికి దారేది' సినిమా ఓవర్సీస్‌లో సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ కాంబినేషన్‌లో సినిమా అంటే అదే స్థాయి అంచనాలున్నాయి. అందుకే ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఈ స్థాయిలో జరగుతోంది. అందుకే ఈ సారి పవన్‌ నుండి రాబోయే సినిమా ఖచ్చితంగా సూపర్‌ హిట్‌ అంటున్నారు. ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్‌ దశలో ఉంది. అనూ ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

 

ALSO READ: శ్రీదేవికి కొత్త కష్టం వచ్చింది