ENGLISH

వాహ‌నాలు నిలిపితే వ‌సూళ్లు వ‌చ్చాయా?

05 September 2021-11:47 AM

ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిల‌ప‌రాదు సినిమాపై సుశాంత్ చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు. చిల‌సౌ లా సైలెంట్ హిట్ అవుతుంద‌ని ఊహించాడు. టీజ‌ర్లు, ట్రైల‌ర్లు బాగానే ఉండ‌డంతో... చిత్ర‌సీమ కూడా ఈ సినిమాపై ఫోక‌స్ పెట్టింది. దానికి తోడు విడుద‌ల‌కు ముందే టేబుల్ ప్రాఫిట్ సంపాదించింది. తీరా రిలీజ్ చేస్తే.. చాలా నిరుత్సాహ‌క‌ర‌మైన వ‌సూళ్లు వ‌చ్చాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాకి క‌నీసం 50 ల‌క్ష‌లు కూడా రాలేదంటే న‌మ్ముతారా? తొలి వారంలో ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా 49 ల‌క్ష‌లు వ‌సూలు చేసింది. ఓ ర‌కంగా.. థియేట‌ర్ అద్దెలు ఎదురు క‌ట్టుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

 

1.5 కోట్లు టేబుల్ ప్రాఫిట్ గా వ‌చ్చినా ఇప్పుడు థియేట‌ర్ అద్దెల రూపంలో అవ‌న్నీ వెన‌క్కి తిరిగి చెల్లించాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఎందుకంటే.. ఈసినిమాని నిర్మాత‌లే సొంతంగా విడుద‌ల చేసుకున్నారు. క‌నీసం నేరుగా ఓటీటీలో విడుద‌ల చేసేసినా... నిర్మాత‌ల‌కు మంచి డ‌బ్బులు గిట్టుబాటు అయ్యేవి.. అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మీనాక్షి చౌద‌రి క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ALSO READ: బుల్లి తెర‌నీ ఊపేసిన జాతిర‌త్నాలు