ENGLISH

RRR పై అవ‌న్నీ రూమ‌ర్లే

30 November -0001-00:00 AM

RRR సంగ‌తేమిటో తేల‌డం లేదు. ఈ సినిమా రిలీజ్ విష‌యంలో చిత్ర‌బృందం ఇంకా గుట్టుగానే ఉంది. అక్టోబ‌రులో ఈ సినిమా రావ‌డం లేద‌న్న‌ది ఖాయం. మ‌రి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎలా? అనేదానిపై ఇంకా స్ప‌ష్ట‌ల తేలేదు. అయితే బ‌య‌ట మాత్రం బోలెడ‌న్ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. RRR సినిమాకి జ‌న‌వ‌రి 8న విడుద‌ల చేస్తార‌ని కొంద‌రు చెబుతున్నారు. ఇంకొంద‌రు ఈసినిమాని ఏకంగా ఓటీటీలోనే విడుద‌ల చేస్తార‌ని, పే ఫ‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిన ఓటీటీకి అమ్మేస్తార‌ని అంటున్నారు. ఇంకొంత‌మందైతే.. ఈ సినిమాని ఒకే రోజు ఓటీటీలోనూ, థియేట‌ర్ల‌లోనూ విడుద‌ల చేస్తార‌ని అంటున్నారు.

 

RRR సినిమా పంపిణీ హ‌క్కుల్ని పెన్ స్టూడియోస్ ద‌క్కించుకుంది. దీనితో పాటు అటాక్‌, గంగూ భాయ్ కేతువాడి అనే మ‌రో రెండు సినిమాల హ‌క్కులు కూడా పెన్ స్టూడియోస్ ద‌గ్గ‌రే ఉన్నాయి. ఈ మూడు సినిమాల్నీ టోకున ఓటీటీకి అమ్మేశార‌ని కూడా అంటున్నారు. అయితే వీటిపై పెన్ స్టూడియోస్ స్పందించింది. ఆర్‌.ఆర్‌.ఆర్ తో పాటు మిగిలిన రెండు సినిమాల్నీ థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేస్తామ‌ని క్లారిటీ ఇచ్చింది. ఓటీటీకి ఇచ్చే ఆలోచ‌న ఏమాత్రం లేద‌ని, పుకార్ల‌ని న‌మ్మొద్ద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే RRR రిలీజ్ డేట్ మాత్రం చెప్ప‌లేదు.

ALSO READ: రామ్ చ‌ర‌ణ్ టైటిల్ ఇదేనా?