ENGLISH

మ‌హేష్ బాబు కోసం మున్నాభాయ్‌!

08 September 2021-15:16 PM

బాలీవుడ్ నుంచి స్టార్ల‌ని దిగుమ‌తి చేసుకోవ‌డం ఈమ‌ధ్య మ‌రీ ఎక్కువైపోయింది. మ‌రీ ముఖ్యంగా విల‌న్ పాత్ర అన‌గానే... పరాయి న‌టులే గుర్తుకొస్తున్నారు. మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా ఎవ‌రు న‌టిస్తారా? అనే ఆస‌క్తి మొద‌లైంది. ఆ పాత్ర కోసం సంజ‌య్ ద‌త్ పేరుని ఫైన‌ల్ చేసిన‌ట్టు స‌మాచారం అందుతోంది.

 

సంజ‌య్ ద‌త్ న‌టించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ లాంటి చిత్రాల్ని తెలుగులో రీమేక్ చేశారు. `చంద్ర‌లేఖ‌` సినిమాలో సంజ‌య్ ద‌త్ ఓ చిన్న పాత్ర‌లో క‌నిపించాడు. ఇప్పుడు సౌత్ సినిమాల‌పై సంజూ ఆస‌క్తి పెంచుకుంటున్నాడు. కేజీఎఫ్ 2లో త‌నే విల‌న్‌.

 

ఇప్పుడు ఈ సినిమాతో టాలీవుడ్ లో కూడా అడుగుపెట్ట‌బోతున్న‌ట్టు స‌మాచారం. సంజ‌య్ ద‌త్ ని తీసుకుంటే... ఈసినిమాని బాలీవుడ్ లోనూ బాగా ప్ర‌మోట్ చేయొచ్చ‌ని త్రివిక్ర‌మ్ భావిస్తున్నాడ‌ట‌. సంజ‌య్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ అంద‌డ‌మే త‌రువాయి.

ALSO READ: శ్రీ‌దేవి కోసం మ‌హేష్, ప్ర‌భాస్ దిగొచ్చినా...