ENGLISH

రాజశేఖ‌ర్‌కి అంత డిమాండా?

30 November -0001-00:00 AM

ఓటీటీల పుణ్యం... కొన్ని సినిమాలు ఈజీగా గ‌ట్టెక్కేస్తున్నాయి. మంచి టైటిల్‌, కాస్తో కూస్తో స్టార్ కాస్టింగ్ ఉంటే చాలు. గిట్టుబాటు రేటు వ‌చ్చేస్తోంది. పేరున్న న‌టీన‌టులు ఉంటే ఇంకా మంచిది. అందుకే థియేట‌ర్ ప‌రంగా మార్కెట్ లేని హీరోలు సైతం, మంచి బిజినెస్ చేసుకోగ‌లుగుతున్నారు. అందుకు శేఖ‌ర్ సినిమానే ఉదాహ‌ర‌ణ‌.

 

రాజ‌శేఖ‌ర్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం శేఖ‌ర్‌. జీవితా రాజ‌శేఖ‌ర్ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. జోసెఫ్ అనే మ‌ల‌యాళ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ సినిమాకి ఓటీటీ నుంచి ఫ్యాన్సీ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ట‌. అమేజాన్ ఈ సినిమాని రూ.25 కోట్ల‌కు కొంటాన‌ని ముందుకొచ్చింద‌ట‌. నిజానికి ఇది బెస్ట్ డీల్‌. మ‌ల‌యాళ రీమేక్ కాబ‌ట్టి.. క‌చ్చితంగా విష‌యం ఉండే ఉంటుంది. దానికి తోడు ఈమ‌ధ్య థ్రిల్ల‌ర్ చిత్రాల‌ను ఓటీటీలో బాగా చూస్తున్నారు. రాజ‌శేఖ‌ర్ గ‌రుడ వేగ సినిమాతో ఫామ్ లోకి వ‌చ్చాడు. క‌ల్కీ కూడా ఓకే అనిపించింది. అందుకే ఈ సినిమాకి ఇంత రేట్ అని తెలుస్తోంది. కానీ చిత్ర‌బృందం మాత్రం ఓటీటీకి ఇవ్వాలా? వ‌ద్దా? అనే విష‌యంలో ఇంకా ఓ నిర్ణ‌యానికి రాలేద‌ని తెలుస్తోంది.

ALSO READ: ఓటీటీలో ఫ‌ట్టు.. టీవీల్లో హిట్టు