ENGLISH

ఓటీటీలో ఫ‌ట్టు.. టీవీల్లో హిట్టు

03 December 2021-12:00 PM

కొన్ని సినిమాలు ఎప్పుడు ఎక్క‌డ ఎలా ఆడ‌తాయో చెప్ప‌లేం. థియేట‌ర్లో ఫ్లాప్ అయిన సినిమాలు, టీవీల‌లోకి వ‌చ్చేస‌రికి హిట్ట‌యిపోతాయి. ఎన్నిసార్లు ప్ర‌ద‌ర్శించినా - సూప‌ర్ హిట్ రేటింగులు వ‌స్తాయి. కొన్ని సినిమాలు థియేట‌ర్లో హిట్ట‌వుతాయి. టీవీల్లో ఎవ‌రూ చూడ‌రు. ఇప్పుడు ట‌క్ జ‌గ‌దీష్‌కీ ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. శివ నిర్వాణ ద‌ర్శ‌కుడు. అమేజాన్ ప్రైమ్ లో నేరుగా విడుద‌లైన సినిమా ఇది. ఓటీటీలో భారీ వ్యూస్ ద‌క్కించుకుంటుంద‌ని భావించారు. కానీ.. ఈ సినిమాకి ఏమాత్రం ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు. ఓటీటీ వ్యూవ‌ర్‌షిప్‌ప‌రంగా ఇదో అట్ట‌ర్ ఫ్లాప్ సినిమా.

 

అయితే టీవీల్లోకి వ‌చ్చేస‌రికి విభిన్న‌మైన ప‌రిస్థితి ఎదురైంది. ఇటీవ‌ల మా టీవీలో ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శిస్తే.. 10.9 రేటింగు వ‌చ్చింది. ఇది చాలా ఎక్కువ‌నే చెప్పాలి. అదీ.. నెగిటీవ్ టాక్ వ‌చ్చిన సినిమాకి. నాని కి ఫ్యామిలీ ఆడియ‌న్స్ లో మంచి క్రేజ్ ఉంది. త‌న సినిమాలు టీవీలో ఎప్పుడు వ‌చ్చినా జ‌నాలు బాగానే చూస్తారు. `వి` సినిమా ఓటీటీలో విడుద‌లైంది. అది ఫ్లాప్‌. టీవీల్లో వ‌చ్చిన‌ప్పుడు కూడా పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. సేమ్ టూ సేమ్‌... ట‌క్ జ‌గ‌దీష్ కీ అలానే జ‌రుగుతుంద‌ని అనుకున్నారంతా. కానీ సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఆ విధంగా నానికి కాస్త ఊర‌ట ల‌భించింద‌నే చెప్పాలి.

ALSO READ: చిరు - బాబి... అరాచ‌కం ఆరంభం