ENGLISH

తొలిరోజు రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన అఖండ‌

03 December 2021-11:00 AM

బాక్సాఫీసుకి పూన‌కాలు తెప్పిస్తున్నాడు అఖండ - బాల‌కృష్ణ‌. బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అఖండ గురువారం విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. బెనిఫిట్ షో నుంచి అంద‌రిదీ ఒకే మాట‌. ఇది... ప‌క్కా మాస్ జాత‌ర అని. వ‌సూళ్లు కూడా అలానే వ‌స్తున్నాయి. బాల‌కృష్ణ కెరీర్‌లోనే ఇంత పెద్ద ఓపెనింగ్స్ రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌లిసి తొలి రోజు.. 14.61 కోట్లు సాధించింది. సెకండ్ వేవ్ త‌ర‌వాత‌.. ఓ తెలుగు సినిమాకి తొలి రోజు ఇన్ని వ‌సూళ్లు రావ‌డం ఇదే ప్ర‌ధ‌మం. గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి 9.76 కోట్లు సాధిస్తే.. ఆ రికార్డుని అఖండ ప‌టాపంచ‌లు చేసింది.

 

ఏరియాల వారీగా తొలి రోజు వ‌సూళ్లు.

 

ఏరియాల వారీగా తొలి రోజు వ‌సూళ్లు.

 

నైజాం : 4.37 కోట్లు

సీడెడ్‌ : 3.25 కోట్లు

ఉత్త‌రాంధ్ర‌ : 1.39 కోట్లు

గుంటూరు : 1.87 కోట్లు

ఈస్ట్ : 1.05 కోట్లు

వెస్ట్‌ : 0.94 కోట్లు

కృష్ణ‌ : 0.81 కోట్లు

నెల్లూరు : 0.93 కోట్లు

 

మొత్తం : 14.61 కోట్లు

ALSO READ: ఇంకా మొద‌ల‌వ్వ‌లేదు.. అప్పుడే రైట్స్ అమ్మేశారా?